»   »  దిమ్మ దిరిగిపోయేలా ‘లెజెండ్’ ఆడియో ఫంక్షన్!

దిమ్మ దిరిగిపోయేలా ‘లెజెండ్’ ఆడియో ఫంక్షన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'సింహా' లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'లెజండ్'. వరుసగా హిట్ మ్యూజిక్ ఇస్తున్న దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 7న హైదాబాద్‌లోని శిల్ప కళా వేదికలో జరుగబోయే లెజండ్ ఆడియో వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

బాలకృష్ణ సినిమా కెరీర్లోనే అత్యంత వైభవోపేతంగా ఈ ఆడియో వేడుక జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ వేడుకకు ఇప్పటి వరకు బాలకృష్ణతో కలిసి పని చేసిన ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. పలువురు కళాకారులతో ప్రత్యేకమైన వినోద కార్యక్రమాలను ప్లాన్ చేసారు.

లెజండ్ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్‌సుంకర నిర్మిస్తున్నారు. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతుండగా, బాలయ్య సరసన రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతి బాబు విలన్ పాత్ర పోషిస్తున్నారు.

ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు ఐటం సాంగు చేస్తున్నట్లు సమాచారం. ఫస్ట్ టీజర్ ని కూడా అతి త్వరలో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 28న గానీ, లేదంటే ఏప్రిల్‌ 4న గానీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. మరో వైపు ఈ చిత్రం బడ్జెట్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. దాదాపు నలభై కోట్ల వరకూ ఈ చిత్రంపై పెట్టుబడి పెడుతున్నట్లు సినీ వర్గాల సమాచారం.

English summary
Nandamuri Balakrishna’s Legend will have its audio launch event on the 7th of this month and grand arrangements are being made by the organisers for the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu