»   »  ‘లెజెండ్’లో పొలిటికల్ డైలాగ్స్-సెన్సార్ ఇబ్బందులు!

‘లెజెండ్’లో పొలిటికల్ డైలాగ్స్-సెన్సార్ ఇబ్బందులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బాలకృష్ణ నటించిన 'లెజెండ్' చిత్రం విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం బాలయ్య రాజకీయ తెరంగ్రేటానికి అనుకూలంగా ఉండబోతోందని, తెలుగుదేశం పార్టీకి మద్దతుగా బాలయ్య డైలాగులు ఉండబోతున్నాయని, అందకు తగిన విధంగా ఈ చిత్రంలో పొలిటికల్ మసాలా బాగా దట్టించారని చాలా కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది.

అయితే దర్శక నిర్మాతలు మాత్రం ఇందులో అలాంటివేమీ లేవని, ఇది బాలయ్య అభిమానులు మెచ్చే విధంగా ఉండే యాక్షన్ ఎంటర్టెనర్ అని చెబుతూ వచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలకు వెళ్లింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సెన్సార్ బోర్డు వారు ఈచిత్రానికి సర్టిఫికెట్ జారీ చేయకుండా హోల్డ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది.

'Legend' in censor trouble

ఈ చిత్రంలో కొన్ని అభ్యంతరకరంగా పొలిటికల్ డైలాగులు ఉన్నాయని, ఈ నేపథ్యంలో బోర్డు సభ్యులు ఎన్నికల సంఘం అధికారులను సంప్రదించే యోచనలో ఉన్నారని, ఎన్నికల సంఘం అధికారుల ఆమోదం తీసుకున్న తర్వాతే సర్టిఫికెట్ జారీ చేస్తారని తెలుస్తోంది. బుధవరాం సాయంత్రంలోగా సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

'లెజెండ్' చిత్రం ఈ నెల 28న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర నిర్మాణ సంస్థలైన 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్, వారాహి చలన చిత్రం సంస్థ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుదలకు ఒక రోజు ముందే భారీగా ప్రీమియర్ షోలు కూడా నిర్వహిస్తున్నారు.

గతంలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'సింహా' లాంటి సూపర్ హిట్ చిత్రం వచ్చిన నేపథ్యంలో 'లెజెండ్' చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నారు. రాధిక ఆప్టేతో పాటు, సోనాల్ చౌహాన్ ఇందులో బాలయ్యకు జోడీగా నటించారు. ఈ చిత్రం ద్వారా జగపతి బాబు విలన్ అవతారం ఎత్తారు. ఇప్పటి వరకు వెండి తెరపై హీరోగా రాణించిన జగపతి....ఈ చిత్రంలో భయంకరమైన విలన్ పాత్రలో దర్శనమివ్వబోతున్నారు.

English summary
Balakrishna’s ‘Legend’ movie in censor trouble. The movie awaiting final approval from the censor board. The film was submitted for approval yesterday but the certificate was placed on hold due to certain political dialogues.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu