»   » ‘లెజండ్’: టెర్రిఫిక్ లుక్‌లో బాలకృష్ణ (ఫోటో)

‘లెజండ్’: టెర్రిఫిక్ లుక్‌లో బాలకృష్ణ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లెజండ్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఇందులో బాలయ్య లుక్ అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

Legend First Look-Balakrishna

వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య సరసన రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ పాత్రలో కనిపిస్తారు. పూర్తి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సామాజిక అంశాలకు పెద్ద పీట వేసారు దర్శకుడు బోయపాటి శ్రీను.

ఈ చిత్రం ఫస్ట్ లుక్ గురించి బోయపాటి శ్రీను మీడియాతో మాట్లాడారు. కొత్త సంవత్సరంలో లెజండ్ లుక్ తో రావటం తనకు ఎంతో ఆనందం కలిగిస్తోందంటున్నాడు. ఈ చిత్రం తనకు ఘన విజయం తెచ్చి పెడుతుందనే నమ్మంగా ఉన్నాడు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ.... ''నాకైతే జనవరి 1.. చాలా స్పెషల్‌. 'లెజెండ్‌' ఫస్ట్‌లుక్‌ ఆ రోజు చూపిస్తున్నా. సినిమా కూడా సిద్ధమైపోతోంది. బాలయ్యతో రెండో సినిమా చేయడం ఈ యేడాది స్పెషల్‌. సింహా తరవాత వస్తున్న కాంబినేషన్‌ కాబట్టి అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలుసు. అందుకు తగ్గట్లుగా సినిమా రూపొందిస్తున్నాం. 'లెజెండ్‌' విడుదలైన రోజు బాలకృష్ణ అభిమానులకే కాదు.. నాకూ పండగే. కొత్త యేడాది అందరికీ బాగుండాలని కోరుకొంటున్నా'' అన్నారు.

చిత్రంలో నెగటివ్ రోల్ వేస్తున్న జగపతి బాబు మాట్లాడుతూ... ''ఈ యేడాది నాకు చాలా స్పెషల్‌. బాలకృష్ణ సినిమాలో ప్రతినాయక పాత్రలో ఆకట్టుకుంటా. నా కెరీర్‌కిది కీలక మలుపు. కథానాయకుడిగా రాణించా. ఇప్పుడు విలన్‌గానూ మెప్పిస్తా అనే నమ్మకం ఉంది. సరికొత్త ఆశలతో 2014లో అడుగుపెడుతున్నా. మీతో పాటు నాకూ ఆల్‌ది బెస్ట్‌'' అన్నారు.

English summary
Here is the first look of Nandamuri Balakrishna's much-awaited flick 'Legend', directed by Boyapati Seenu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu