»   » బాలయ్యా ఎప్పుడొస్తావయ్యా అంటే...ఇదీ సమాధానం!

బాలయ్యా ఎప్పుడొస్తావయ్యా అంటే...ఇదీ సమాధానం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న నూతన చిత్రం 'లెజెండ్‌'. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం సంక్రాంతికి వస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నప్పటికీ సినిమా పూర్తి కాక పోవడంతో విడుదల కాలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రాన్ని మార్చి చివరి వారంలోగానీ, ఏప్రిల్ మొదటి వారంలో గానీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోటీ లేని సమయంలో ఈ సినిమాను ఎక్కువ థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 Legend: March last week or April first week

ఈ సినిమాలో బాలకృష్ణని చూపించేందుకు బోయపాటి శ్రీను చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. తెరపై ఆయన్ని ఓ కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కారు, బైక్‌లను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఇటీవల 'లెజెండ్‌' బైక్‌ని తయారు చేసిన విధానాన్ని వీడియో రూపంలో విడుదల చేశారు. అలాగే ఒక సఫారీ వాహనాన్ని కూడా ప్రత్యేక హంగులతో తయారు చేయించారు. అవన్నీ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

''సింహా తరవాత బాలకృష్ణ, బోయపాటి కలయికలో వస్తున్న చిత్రమిది. అంచనాలు తప్పకుండా అందుకొంటాం. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. జగపతిబాబు విలన్ గా నటించారు''అని నిర్మాతలు చెబుతున్నారు. మార్చిలో 'లెజెండ్‌' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

English summary

 Close sources inside 14 reels office revealed that ‘Legend’ will hit screens either in last week of March or first week of April.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu