»   » బాలయ్యను పువ్వుల్లో ముంచేసారు (లెజెండ్100 సెలబ్రేషన్స్)

బాలయ్యను పువ్వుల్లో ముంచేసారు (లెజెండ్100 సెలబ్రేషన్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: లెజెండ్ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని నందమూరి బాలకృష్ణ అభిమానుల సమక్షంలో హిందూపురంలో విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనపై పూల వర్షం కురపించారు. గజమాలలతో సత్కరించారు. బాలయ్యను పూలతో ముంచేసారు.

బాలయ్య హిందూపురం నుండి అసెంబ్లీకి ప్రాతినిద్యం వహిస్తున్న నేపథ్యంలో ఈ వేడుక ఇక్కడ నిర్వహించారు. ఈ వేడుకలో 'లెజెండ్' చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు నిర్మాత అనిల్ సుంకర తదితరులు పాల్గొన్నారు. అభిమానుల కేరింతలు, సందడి మధ్య కోలాహలంగా 'లెజెండ్' విజయోత్సవ వేడుక జరిగింది.

ఈ సందర్భంగా బాలయ్య చేతుల మీదుగా పేదలకు ఆర్థిక సహాయం చేసారు. లెజెండ్ విజయోత్సవ వేడుకకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

లెజెండ్

లెజెండ్


'' లెజెండ్ '' చిత్రం మార్చి 28న రిలీజ్ అయి నేటితో(జులై 5)తో 100 రోజుల కంప్లీట్ చేసుకుంది.

భారీ హిట్

భారీ హిట్


బాలయ్య నట విశ్వరూపం, బోయపాటి దర్శకత్వ ప్రతిభ, జగపతి బాబు విలనిజం వెరసి లెజెండ్‌ని లెజెండరీ హిట్ గా నిలిపాయి.

మ్యూజికల్‌గా కూడా హిట్

మ్యూజికల్‌గా కూడా హిట్


దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా బాలయ్య చిత్రానికి సంగీతం అందించిన ఈ లెజెండ్ మ్యూజికల్ హిట్ గా నిలవడమే కాకుండా రీ రికార్డింగ్ ని కూడా అద్భుతంగా ఇచ్చాడు దేవి.

నిర్మాతలకు లాభం

నిర్మాతలకు లాభం


భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు గోపీచంద్ ఆచంట రామ్ ఆచంట,అనిల్ సుంకర, సాయి కొర్రాపటి నిర్మించారు. లాభాలు ఆర్జించారు.

లెజెండ్ వసూళ్లు

లెజెండ్ వసూళ్లు


శాటిలైట్ రైట్స్, థియేట్రికల్ష్ రైట్స్ కలుపుకుని ఈ చిత్రం దాదాపు రూ. 50 కోట్ల వరకు వసూలు చేసి నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టింది.

హీరోయిన్లు

హీరోయిన్లు


ఈ చిత్రంలో బాలయ్య సరసన రాధిక ఆప్టే, సోనాల్ చౌహన్ నటించారు.

100 డేస్ సెంటర్స్

100 డేస్ సెంటర్స్


‘లెజెండ్' చిత్రం రాష్ట్ర వ్యాప్తంగా 31 సెంటర్లలో 100 రోజుల వేడుక జరుపుకుంటోంది.

English summary

 Balakrishna's Legend movie 100 days celebrations held at Hindupur.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu