»   » భయపడుతూనే! లెజెండ్ సంబరాల్లో బాలయ్య (ఫోటోలు)

భయపడుతూనే! లెజెండ్ సంబరాల్లో బాలయ్య (ఫోటోలు)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: సినిమాల్లో సింగిల్ హ్యాండుతో డజన్లకొద్దీ రౌడీలకు ముచ్చెమటలు పట్టించే బాలకృష్ణ, రియల్ లైఫ్ లోనూ డేరింగ్ అండ్ డాషింగ్‌గా ముందుకు సాగుతుంటారు. అయితే బాలయ్యను ఓ చిన్న చిచ్చుబుడ్డి భయ పెట్టింది. లెజెండ్ సక్సెష్ బాష్‌లో భాగంగా గురువారం రామానాయుడు స్టూడియోలో బాలయ్యతో పాటు ఇతర నటీనటులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా కాస్త భయపడుతూనే దూరంగా ఉండి బాణా సంచా కాల్చారు బాలయ్య.

  14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్, వారాహి చలన చిత్రం సంయుక్త నిర్మాణంలో.... నందమూరి బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, రాధిక ఆప్టే హీరో హీరోయిన్లుగా నటించిన 'లెజెండ్' చిత్రం భారీ విజయం సాధించి నేపథ్యంలో రామానాయుడు స్టూడియోలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు.

  ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ....నాలోనూ, బోయపాటి శ్రీను లోనూ ఒకే రకమైన ఆవేశం ఉంటుంది. అందుకే మా ఇద్దరి కాంబినేషన్ బాగా కుదిరింది. ఈ చిత్రానికి లెజెండ్ అని టైటిల్ పెట్టడమే పెద్ద చాలెంజ్. నిజ జీవితంలో లెజెండ్ అంటే ఎన్టీఆర్ గారే. ఆయన నాకు తండ్రి మాత్రమే కాదు..గురువు, దైవం అన్నారు.

  మిగతా వివరాలు స్లైడ్ షోలో...

  ఎంకరేజ్ చేయను

  ఎంకరేజ్ చేయను

  సాధారణంగా నేను కాస్టింగ్ గురించి పట్టించుకోను. అదే సమయంలో మిస్ కాస్టింగును ఎంకరేజ్ చేయను. జగపతి బాబు గొప్ప నగుడు. ఇతర నటీనటులు బాగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ మంచి సంగీతం అందించారు. సినిమాకు సాంకేతిక నిపుణులతో పాటు ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేసారు అని బాలయ్య వ్యాఖ్యానించారు.

  బోయపాటి మాట్లాడుతూ...

  బోయపాటి మాట్లాడుతూ...

  నా కళ్లు కెమెరామెన్ రామ్ ప్రసాద్, రచయిత రత్నంగారు నా భావాలు భాగా అర్థం చేసుకుంటారు. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ నా ఊహలకు ప్రాణం పోస్తుంటారు. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, కమల్ కణ్ణన్ బాగా సహకరించారు. అందరికీ థాంక్స్ అన్నారు.

  అనిల్ సుంకర మాట్లాడుతూ...

  అనిల్ సుంకర మాట్లాడుతూ...

  బాలయ్యతో సినిమా చేసాక అన్నగారితో సినిమా చేయలేక పోయామనే బాధ సంగం తీరింది. అభిమానులకు మేం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. వారు కూడా మాట నిలబెట్టుకుని సినిమాను పెద్ద హిట్ చేయాలి అన్నారు.

  జగపతి బాబు మాట్లాడుతూ...

  జగపతి బాబు మాట్లాడుతూ...

  ఈ సినిమాలో నేను డైలాగు చెప్పినట్లే నేను కారం లేకుండా తినను. అహంకారం లేకుండా ఉండను. నేను జిడ్డుగాడినే. ఇండస్ట్రీ నన్ను తరిమేయాలని చూసినా నేను వెళ్లను. ఇక్కడే ఉంటాం. ప్రజల గుండెల్లో ఉంటా. మూడు నాలుగేళ్లుగా నాకు తెలియని ఆకలి, నిద్ర లేదు. కానీ ఈ సినిమా నాకు కడుపునిండా అన్నం పెట్టింది. నిద్ర పోనిచ్చింది. నేను విలన్ పాత్ర చేయడం మహిళా అభిమానులకు నచ్చడం ఆనందంగా ఉంది అన్నారు.

  దేవిశ్రీ మాట్లాడుతూ...

  దేవిశ్రీ మాట్లాడుతూ...

  నాకు సంగీతమే ప్రాణం. నా జీవితంలో సంగీతం, సినిమాలు తప్ప మరేదీ ఉండదు. బాలకృష్ణ గారికి నేను సంగీతం అందించిన తొలి సినిమా చాలా పెద్ద హిట్ అయినందుకు ఆనందంగా ఉంది అన్నారు.

  లెజెండ్

  లెజెండ్

  14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్, వారాహి చలన చిత్రం సంయుక్త నిర్మాణంలో.... నందమూరి బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, రాధిక ఆప్టే హీరో హీరోయిన్లుగా నటించిన ‘లెజెండ్' చిత్రం భారీ విజయం సాధించింది.

  50 కోట్ల దిశగా...

  50 కోట్ల దిశగా...


  లెజెండ్ చిత్రం ఇప్పటికే భారీగా వసూళ్లు రాబట్టింది. త్వరలోనే ఈచిత్రం రూ. 50 కోట్లు వసూలు చేసిన సినిమాల క్లబ్బులో చేరుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

  English summary
  Nandamuri Balakrishna, Sonal Chauhan, Radhika Apte starrer Legend Movie Success Meet Function held at Hyderabad. Actor Balakrishna, Actress Sonal Chauhan, Director Boyapati Srinu, Devi Sri Prasad, Sujata Kumar, Jagapathi Babu, Anil Sunkara, Sai Korrapati, Chalapathi Rao, L.B.Sriram graced the event.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more