»   » రికార్డ్: బాలయ్య ‘లెజెండ్’ టిక్కెట్ ధర రూ. 67,000

రికార్డ్: బాలయ్య ‘లెజెండ్’ టిక్కెట్ ధర రూ. 67,000

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ 'లెజెండ్' చిత్రం ఈ నెల 28న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర నిర్మాణ సంస్థలైన 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్, వారాహి చలన చిత్రం సంస్థ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుదలకు ఒక రోజు ముందే భారీగా ప్రీమియర్ షోలు కూడా నిర్వహిస్తున్నారు.

అమెరికాలో కూడా 'లెజెండ్' ఈచిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. తాజాగా బాలయ్య అభిమాని ఒకరు అమెరికాలో ప్రదర్శించే ఈ చిత్రం ప్రీమియర్ షో తొలి టిక్కెట్‌ను భారీ ధరకు కొనుగోలు చేసాడు. 1116 డాలర్లు(దాదాపు రూ. 67,000) చెల్లించి టిక్కెట్ దక్కించుకున్నాడు. డెట్రాయిట్‌కు చెందిన ఎం. నితీష్ అనే అభిమాని ఈ టికెట్ దక్కించుకున్నారు.

Legend ticket sold for RS 67,000

సినిమా టిక్కెట్‌కు ఇంత భారీ మొత్తం చెల్లించడం రికార్డ్ అని, ప్రపంచంలోనే ఇదొక రికార్డ్ అని బాలయ్య అభిమానులు అంటున్నారు. 'లెజెండ్' చిత్రం భారీ విజయం సాధిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టే విధంగా సినిమా ఉంటుందని అంటున్నారు.

గతంలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'సింహా' లాంటి సూపర్ హిట్ చిత్రం వచ్చిన నేపథ్యంలో 'లెజెండ్' చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నారు. రాధిక ఆప్టేతో పాటు, సోనాల్ చౌహాన్ ఇందులో బాలయ్యకు జోడీగా నటించారు. ఈ చిత్రం ద్వారా జగపతి బాబు విలన్ అవతారం ఎత్తారు. ఇప్పటి వరకు వెండి తెరపై హీరోగా రాణించిన జగపతి....ఈ చిత్రంలో భయంకరమైన విలన్ పాత్రలో దర్శనమివ్వబోతున్నారు.

English summary
Balakrishna Legend ticket sold for RS 67000. A diehard fan of Balakrishna, by name Nitesh Mandalapa at the United States is owned his ticket, which is the first ticket for the premier show of his favorite hero’s film Legend by spending 1,116 dollars worth about 67000 rupees.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu