»   » డైరక్టర్ వంశీ తీస్తున్న షార్ట్ ఫిల్మ్ ...పోస్టర్లు

డైరక్టర్ వంశీ తీస్తున్న షార్ట్ ఫిల్మ్ ...పోస్టర్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు వంశీ ఇటీవలే 25 చిత్రాలను పూర్తి చేశారు. అజ్మల్, నికితా నారాయణ్ జంటగా 'మెల్లగా తట్టింది మనసు తలుపు' పేరుతో తెరకెక్కిన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే... ఆయనో షార్ట్ ఫిల్మ్ కు శ్రీకారం చుట్టారు.

ఈతరం ప్రేమలు, బ్రేకప్‌లను తనదైన శైలిలో డిస్కస్ చేస్తూ 15 నిమిషాల నిడివితో వంశీ ఈ లఘుచిత్రం తీశారు. 'మధుర' శ్రీధర్ దీనికి నిర్మాత. ఇద్దరు కొత్త తారలతో దీన్ని తెరకెక్కించారు. త్వరలోనే ఈ లఘుచిత్రాన్ని యూ ట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు.

వంశీ లాంటి సుప్రసిద్ధ దర్శకుడు షార్ట్ ఫిల్మ్ తీశాడంటే నిజంగా విశేషమే. బాలీవుడ్‌లో ఇటీవల కాలంలో కొంతమంది ప్రముఖ దర్శకులు షార్ట్ ఫిల్మ్స్ తీయడం మొదలు పెట్టారు. కానీ తెలుగులో ఇంకా పూర్తి స్థాయిలో ఈ ట్రెండ్ మొదలు కాలేదు.

LETTER – A Short Film By Director VAMSY

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వంశీ... తలుపు తట్టాడుఅజ్మల్‌, నిఖితా నారాయణ్‌ జంటగా నటించిన చిత్రం 'తను మొన్నే వెళ్లిపోయింది'. వంశీ దర్శకత్వం వహించిన 25వ చిత్రమిది. అయితే ఈ సినిమా పేరు ఇప్పుడు మారింది. 'మెల్లగా... తట్టింది మనసు తలుపు!' అని కొత్తగా నామకరణం చేశారు. డి. వెంకటేష్‌ నిర్మాత.

అజ్మల్‌ చెబుతూ ''వంశీగారి సినిమా అనగానే చిక్కనైన తెలుగు కథలు, చక్కని పేర్లు గుర్తొస్తాయి. పసందైన సంగీతం ఉంటుంది. అవన్నీ ఈ సినిమాలోనూ ఉంటాయి. విచిత్ర కోణంలో సాగే ప్రేమకథ'' అన్నారు. వంశీ గత సినిమాల తరహాలోనే ప్రేక్షకులకి కనువిందు చేస్తుందన్నారు వెన్నెలకంటి.

నిర్మాత మాట్లాడుతూ ''చక్రి సంగీతం అందించిన ఈ చిత్రంలో నాలుగు పాటలున్నాయి. అవన్నీ శ్రోతల్ని ఆకట్టుకొంటాయి. కథకి ఈ పేరైతే ఇంకా బాగా కుదురుతుందనిపించి పేరు మార్చాం. త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము''అన్నారు.

లేడీస్ టైలర్ విషయానికి వస్తే..

తాజాగా వంశీ దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కబోతున్న సినిమానూ 'మధుర' శ్రీధరే నిర్మించబోతున్నారు. విశేషం ఏమంటే ఈ మూవీలో ఏకంగా తొమ్మిది మంది హీరోయిన్లు నటించబోతున్నారట. 'లేడీస్ టైలర్' షేడ్స్ లో సాగే ఈ చిత్రాన్ని రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వంశీ తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ ఫైనల్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారు.

English summary
Senior director Vamsi and news is that he has directed a short film. As per reports Vamsi has made a short film titled Letter which deals with hot topic of love and break-ups. This short film is having 15 minutes duration and it was produced by Madhura Sreedhar.
Please Wait while comments are loading...