»   » నితిన్ ‘లై’ మూవీ పబ్లిక్ టాక్ ఇలా.... వర్కౌట్ అవుతుందా?

నితిన్ ‘లై’ మూవీ పబ్లిక్ టాక్ ఇలా.... వర్కౌట్ అవుతుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఒక డిఫరెంట్ చిత్రం 'లై'(లవ్ ఇంటెలిజెన్స్ ఎనిమిటీ). నితిన్, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈచిత్రంలో సీనియర్ నటుడు అర్జున్ విలన్ పాత్ర పోషించారు.

లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లవ్, ఎనిమిటీని హీరో తన ఇంటలిజెన్స్ ఉపయోగించి ఎలా మేనేజ్ చేశాడు అనేది మూల కథ. సినిమాపై ఇంత హైప్ రావడానికి కారణం ట్రైలర్, మణిశర్మ సంగీతం మరియు 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ వారి ప్రొడక్షన్ వ్యాల్యూస్.


పాజిటివ్ రెస్పాన్స్

పాజిటివ్ రెస్పాన్స్

శుక్రవారం సినిమా గ్రాండ్‌గా రిలీజైంది. సినిమాకు రెస్పాన్స్ పాజిటివ్‌గా ఉంది. రొటీన్ సినిమాలు భిన్నంగా కథ, కథనం ఉంది. స్క్రీన్ ప్లే కూడా భిన్నంగా ఉంది అనే టాక్స్ వినిపిస్తోంది.


నితిన్ అదరగొట్టాడు

నితిన్ అదరగొట్టాడు

నితిన్ లుక్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టాడు. యాక్షన్ సీన్లలో నితిన్ కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ చూపించాడు. మేఘా ఆకాష్ అందం పరంగా ఆకట్టుకుంది. పెర్ఫార్మెన్స్ పరంగా ఓకే. నితిన్-మేఘా మధ్య వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి.


విలన్ పాత్రలో అర్జున్

విలన్ పాత్రలో అర్జున్

విలన్ పాత్రలో సీనియర్ నటుడు అర్జున్ తనదైన శైలి నటన, పవర్‌ఫుల్‌ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమాలో నితిన్, అర్జున్ మధ్య వచ్చే సీన్లు సినిమాకే హైలెట్.
టెక్నికల్ అంశాల పరంగా

టెక్నికల్ అంశాల పరంగా

టెక్నికల్ అంశాల పరంగా చూస్తే... మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్, సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. జె యువరాజ్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సినిమాలో చూపించిన విదేశీ లొకేషన్లు, కొరియోగ్రఫీ చాలా బావుందనే టాక్ వినిపిస్తోంది.


ఫస్టాఫ్ ఎలా ఉంది?

ఫస్టాఫ్ ఎలా ఉంది?

సినిమా ఫస్టాఫ్ ఒక డిఫరెంట్ జోనర్ చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది. నేరేషన్ చాలా గ్రిప్పింగ్‌గా సాగింది. సెకండాఫ్‌పై మరింత ఆసక్తి కలిగేలా సినిమా రన్ చేశారు. విలన్ పాత్రలో అర్జున్ పెర్ఫార్మెన్స్ హైలెట్. రోటీన్ సినిమాల మాదిరి కామెడీ కోరుకునే వారు కాస్త నిరాశ పడతారు.


మైండ్ గేమ్

మైండ్ గేమ్

‘లై' మూవీ అర్జున్-నితిన్ మధ్య జరిగే మైండ్ గేమ్ నేపథ్యంతో సాగుతుంది. సినిమా మొదటి నుండి చివరి వరకు సస్పెన్స్ మెయింటేన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.


కమర్షియల్‌గా వర్కౌట్ అవుతుందా?

కమర్షియల్‌గా వర్కౌట్ అవుతుందా?

‘లై' సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్టుతో నడిచే సినిమా. మెజారిటీ ఆడియన్స్ బావుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫస్ట్ డే ఫస్ట్ షోకు వచ్చే వారంతా నితిన్ అభిమానులో, సినిమా మీద పిచ్చి ఉన్నవాళ్లే ఉంటారు. రోటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ మీద ఆధారపడిన సినిమా కాదు కాబట్టి... సినిమా ఎంత మందికి ఎక్కుతుంది అనేది చూడాలి.


English summary
Director Hanu Raghavapudi's Telugu movie LIE (Love Intelligence Enmity) starring Nithiin, Arjun Sarja and Megha Akash has received positive review and rating from the audience.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu