For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’రిలీజ్ వాయిదా

  By Srikanya
  |

  హైదరాబాద్ : శేఖర్ కమ్ముల తాజా చిత్రం 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'. ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల చేస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడది వాయిదా పడిందని తెలుస్తోంది. అయితే ఒక్క రోజు మాత్రమే రిలీజ్ ని ముందుకు జరిపారు. సెప్టెంబర్ 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ చిత్రం టెక్నికల్ సమస్యతో ఒక రోజు ముందుకు జరిపినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ప్రమోషన్ ఈ వారం నుంచే భారీ ఎత్తున మొదలెట్టనున్నారు.

  ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం కథకు స్ఫూర్తినిచ్చిన విషయం గురించి చెప్తూ...'హ్యాపీడేస్‌'తో నాలుగు జంటల కళాశాల జీవితాల్ని చూపించాను. మరి ఇళ్ల దగ్గర అలాంటి అందమైన జీవితం ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించినప్పుడు స్ఫురించిన కథే ఇది. కాలనీలోని ఇరుగుపొరుగుతో కష్టసుఖాల్ని పంచుకొనే పెద్దలు.. అంతా కలిసి చేసుకొనే పండగలు, మరోపక్క పిల్లల గోలీలాట, కాగితపు పడవలు, గల్లీ క్రికెట్టు... ఇలాంటివన్నీ రుచి చూస్తే ఎవరి జీవితమైనా అందంగా మారిపోతుందని చెబుతున్నాం. ఆశలు, ఆకాంక్షలు, రొమాన్స్‌, భావుకత, గందరగోళం, లక్ష్యాలు.. ఇవన్నీ కలగలిసిన చిత్రమిది.

  ఈ చిత్రం గురించి శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. పళ్లెంలో ఏమీ లేదు అనుకోవడం కన్నా పోనీలే పళ్లెం అయినా ఉంది కదా అనుకోవడంలోనే ఉంది అసలు ఆనందం. కరెంటు లేదు. గుడ్. వెన్నెల రాత్రుళ్లలో బయట అరుగు మీద కూచుని కబుర్లు చెప్పుకోండి. గ్యాస్ దొరకదు. వెరీగుడ్. నాలుగు ఇళ్లూ కలిసి గ్రూప్‌గా వండుకొని కలిసి మెలిసి భోం చేయండి. ట్రాఫిక్ దారుణం. ఇంకా గుడ్. ఆ పూట సెలవు పెట్టి హాయిగా భార్యాబిడ్డలతో గడపండి. సీ.... మనం కొన్నింటి బాధితులం. ఆ బాధను బాధగా చూడటం కన్నా దానిలో ఆనందం వెతుక్కుంటే బెటర్ అని చెప్పేదే నా రాబోయే 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమా అన్నారు శేఖర్ కమ్ముల

  కొత్త వాళ్లతోనే చేయటానికి కారణం...నేను రాసుకొనే కథలు అలా ఉంటాయి. కథకు కావాలనుకొన్నప్పుడే కొత్తవాళ్లను ఎంపిక చేసుకొంటాను. పాత్రలకు తగ్గట్టుగా నటీనటులు తొందరగా దొరికితే అంతా బాగానే ఉంటుంది. లేకపోతే మాత్రం ఇబ్బందే. ఈ సినిమాలోని నటీనటుల ఎంపిక ప్రక్రియ చాలా సమయం తీసుకొంది. అందుకే సినిమా ఇంత ఆలస్యమైంది అన్నారు. ఇక పూర్తిస్థాయి మాస్‌ మసాలా సినిమాలు తియ్యడం నాకు రాదు. అందుకే అటు వైపు ఆలోచించను. అయితే... నాలా సున్నితమైన కథాంశాల్ని తెరకెక్కించే దర్శకులు కూడా కొద్దిమంది ఉండాలంటాను. ఒకప్పటి సమాజంలో ఇప్పటిలా అరాచకాలు ఉండేవి కాదు. కేవలం తెరపైన కనిపించే ప్రతినాయకుల పాత్రలతోనే అలాంటివి చూసేవాళ్లం. సినిమాల్లోనే అలాంటివాళ్లుంటారని చెప్పుకొనేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా నీచాతినీచాలు, దిగజారుడుతనాలు కనిపిస్తున్నాయి. ఇక సినిమాల్లో కూడా ఆ తరహా కథలు అనసవరం అనేది నా అభిప్రాయం అన్నారు.

  English summary
  
 Release of Sekhar Kammula's Life is Beautiful has been pushed by a day. Earlier the film was to be released on 13th September, but now it will hit theaters on 14th September. The film's shoot was completed few weeks ago. Sekhar Kammula has said that the promotions of the film will commence this week and will be done in a unique style.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X