twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాలీవుడ్‌ ఆఫర్ అని ఊహించలేదు

    By Srikanya
    |

    ముంబై: ముంబైలో తొమిదో తరగతి చదువుతున్న ఆయూష్‌ కి హాలీవుడ్ సినిమా చేయటం చాలా ఉత్సాహంగా ఉంది. నిజానికి ఆయూష్ కి బాలీవుడ్‌ కొత్తేమీ కాదు. మొదటి నుంచి ఛోటా ప్యాకెట్‌ మే బడా ధమాకా అని నిరూపించుకున్నాడు ఈ బాల నటుడు ఆయూష్‌ టాండన్‌. డాన్స్‌, రియాల్టీ షోలలో పలుమార్లు విజేతగా నిలిచాడు. 'సాత్‌కూన్‌ మాఫ్‌' సినిమాలో తన నటనతో అబ్బురపరిచాడు. బుల్లితెర, వెండి తెరే కాకుండా ప్రకటనల రంగంలోనూ ఒక వెలుగు వెలుగుతున్నాడు. హాలీవుడ్‌ డైరెక్టర్‌ ఆంగిలీ చిత్రం 'లైఫ్‌ ఆఫ్‌ పై' చిత్రంలో నటించడం ద్వారా మరోసారి వార్తల్లోకెక్కాడు ఈ బుడుతడు.

    ఆస్కార్‌ విజేత డైరెక్టర్‌ ఎంగిలీ దర్శకత్వంలో రూపొందించిన 'లైఫ్‌ ఆఫ్‌ పై' చిత్రంలో నటించడం తన జీవితంలో మరువరాని మధుర ఘట్టమని మాస్టర్‌ ఆయూష్‌ టాండన్‌ తెలిపాడు. ఆయన దర్శకత్వంలో పని చేయడం తన అదృష్టమే కాకుండా భగవంతుడందించిన గొప్ప వరంగా అభివర్ణించాడు. 'లైఫ్‌ ఆఫ్‌ పై'లో అవకాశం ఎలా వచ్చిందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఆడిషన్‌ కోసం ఒక కాస్టింగ్‌ ఏజెన్సీ ద్వారా ఆడిషన్‌ ఇచ్చినట్లు చెప్పాడు. తానిచ్చిన ఆడిషన్‌ ఒక ఇంగ్లిష్‌ సినిమాకు సంబంధించిన విషయమని తెలుసునన్నాడు.

    హాలీవుడ్‌ దర్శకుడు ఆంగిలీ సినిమా అని తెలియదని చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత తనను ఎంపిక చేస్తూ అమెరికా నుంచి ఒక ఫోన్‌ కాల్‌ వచ్చిందని, లుక్‌ టెస్ట్ కోసం 11 రోజుల్లోగా తైవాన్‌ రావాల్సిందిగా ఆ సందేశంలో పేర్కొన్నారని వివరించాడు. తాను ఆస్కార్‌ విజేత ఎంగిలీ చిత్రంలో నటించబోతున్నానని తొలిసారి తెలుసుకొని ఎంతో ఉద్వేగానికి లోనైనట్లు తెలిపాడు. ఈ సినిమాలో నిజమైన పెద్ద పులితో తీసిన సన్నివేశం మహత్తరమైనదని వివరించాడు. ఈ సన్నివేశంలో తన హావభావాలను వ్యక్తీకరించేందుకు ఎంగిలీ తనకు ఇచ్చిన సూచనలు జీవితాంతం గుర్తుండేలా ఉన్నాయన్నాడు.

    పెద్దపులి తనవైపు వచ్చేటప్పుడు హావభావాలను మరో విధంగా ప్రకటించాల్సి ఉండటంతో తాను ఎంతో ఉద్విగ్నతకు గురయ్యాయని తెలిపాడు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటులు టాబు, ఇర్ఫాన్‌ ఖాన్‌తో నటించడం గొప్ప అనుభూతి కలిగిందన్నాడు. ఎంగిలీతో కలిసి పని చేయడం తన లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌గా అభివర్ణించాడు. మొదటి షెడ్యూల్‌ పది రోజుల పాటు తైవాన్‌లో గడిపానని, ఆ సమయంలో తల్లిదండ్రులు తన వెంటనుండటంతో కుటుంబ బెంగ కలుగలేదని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చాడు.

    వినయం, విధేయత, కేరింగ్‌, సార్ట్ నేచర్‌ గల ఒక గొప్ప దర్శకుడితో తాను మనోభావాలను పంచుకోవడం గొప్ప అనుభూతిని కలిగించిందన్నాడు. అనుభవంతోపాటు ఎన్నో చిట్కాలను కూడా నేర్చుకున్నట్లు చెప్పాడు. 'లైఫ్‌ ఆఫ్‌ పై' చిత్రం విద్యార్థిలోకంలో చరిత్రను తిరగరాయనుందని పేర్కొన్నాడు. నగరంలోని సెయింట్‌ అగెస్టీన్‌ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆయూష్‌ చదువుతోపాటు నటన, నృత్యాలపై కూడా అంతే దృష్టిని సారించాడు. ఈ ఘనతంతా తన తల్లిదండ్రులకే దక్కుతుందని, స్వతహాగా ఒక దశాబ్దంపాటు బుల్లితెర నటుడిగా పేరొందిన హతిందర్‌ టాండన్‌ తన తండ్రి కావడంతో ఆయన వద్దే నటన, నృత్యాలలో శిక్షణ పొందినట్లు వివరించాడు.

    English summary
    Ayush plays young Pi in Life of Pi, the screen adaptation of Yann Martel's Booker Prize winning fantasy adventure novel of the same name. The 14-year-old is a Class 9 student and says his Life Of Pi experience will remain unforgettable. "It was a great experience. I will never forget it. Working with an Oscar-winning director was great. Ang Lee is so soft and caring. Ang Lee was very good to me. He can't be strict ever. He guided me what to do and what not to do, and explained all scenes. He personally acted and showed me how to act," he said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X