twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Liger గొడవలో న్యూ ట్విస్ట్.. ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసిన పూరి జగన్నాథ్.. ప్రాణహాని ఉందంటూ..

    |

    విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన లైగర్ సినిమా విడుదలకు ముందు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పరచుకుంది. అయితే సినిమా విడుదల తర్వాత ఊహించిన విధంగా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తీవ్ర స్థాయిలో నష్టాలను కలిగించడంతో డిస్టిబూటర్లు ఎగ్జిబిటర్లు నష్టాలను తగ్గించాలి అని పూరి జగన్నాథ్ పై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో పూరి కూడా ఆ విషయంపై స్పందించాడు. అయితే ఇప్పుడు ఊహించిన విధంగా పూరి జగన్నాథ్ ఇద్దరిపై పోలీస్ కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

    సినిమా డిజాస్టర్ కావడంతో..

    సినిమా డిజాస్టర్ కావడంతో..

    విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాను దర్శకుడు పూరి జగన్నాథ్ గ్రాండ్ గా తెరపైకి తీసుకువచ్చాడు. ఈ సినిమా పూర్తిస్థాయిలో సక్సెస్ కాకపోవడంతో తీవ్రంగా నష్టాలను కలిగించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా కారణంగా డిస్ట్రిబ్యూటర్లు చాలావరకు నష్టపోవాల్సి వచ్చింది. దీంతో వాళ్ళు పూరి జగన్నాథ్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు.

     కొంత సమయం కావాలని..

    కొంత సమయం కావాలని..

    లైగర్ సినిమా కారణంగా తీవ్రంగా నష్టపోయినట్లు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు అందరూ కలిసి పూరి జగన్నాథ్ ను ఆశ్రయించడంతో ఆయన తప్పకుండా కొంత నష్టాలను భరించేందుకు మాట కూడా ఇచ్చారు. అయితే అందుకు కొంత సమయం కావాలి అని పూరి జగన్నాథ్ ముందుగానే చెప్పాడు. కానీ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిసి పూరి ఆఫీస్ ముందు ధర్నా చేసేందుకు దిగారు.

    పరువు పోయే విధంగా

    పరువు పోయే విధంగా


    అయితే తను ఇస్తానని చెప్పినప్పటికీ కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచడం అలాగే పరువు పోయే విధంగా ధర్నా చేస్తాను అనడం పై పూరీకి తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతే కాకుండా ఎవరైతే ధర్నా చేస్తారో వారికి డబ్బులు ఇవ్వను అని అసలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అని పూరి అన్నాడు. అందరూ బాగుండాలి అని ఆలోచనతోనే తాను డబ్బులు ఇస్తానని అన్నట్లుగా పూరి ఒక ఆడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.

    వారిపై కేసు నమోదు

    వారిపై కేసు నమోదు


    అయితే ఈ క్రమంలో పూరి జగన్నాథ్ జూబ్లీహిల్స్ లోని పోలీస్ స్టేషన్లో ఇద్దరి పై కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్షియర్ శ్రీధర్ లు తనను వేధిస్తున్నారు అని తను లేని సమయంలో ఇంటికి వెళ్లి ఇక్కడ ఫ్యామిలీని కూడా డిస్టర్బ్ చేస్తున్నారు అని పూరి జగన్నాథ్ పోలీసులను ఆశ్రయించాడు.

    ప్రాణహాని ఉందని

    ప్రాణహాని ఉందని

    వరంగల్ శ్రీను శోభన్ ఇద్దరు కూడా టైగర్ సినిమాకు సంబంధించి బిజినెస్ లో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని అలాగే తన కుటుంబాన్ని కూడా బెదిరిస్తున్నారు అంటూ ఈ క్రమంలో తమకు రక్షణ కల్పించాలి అని పూరి జగన్నాథ్ పోలీసులను ఆశ్రయించాడు. అదేవిధంగా తన ఇంటిపై కూడా దాడి చేసే అవకాశం ఉంది అని ముందస్తుగానే ఈ విషయంలో పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు పూరి కేసులో వివరణ ఇచ్చారు.

    English summary
    Liger Director Puri Jagannadh lodges complaint against Warangal Srinu and shobhan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X