twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏం తేలనుంది? : ఈ రోజే రజనీకాంత్ తో చర్చలు

    By Srikanya
    |

    చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించిన 'లింగ' పదిరోజుల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆశించిన స్థాయిలో ఈ చిత్రం విజయాన్ని అందించలేకపోయింది. విడుదలకు ముందు అంచనాలు భారీగా కనిపించాయి. తమిళనాడులో మాత్రమే రూ.150 కోట్లకు పైగా బిజినెస్‌ జరిగినట్లు ప్రచారం సాగుతోంది. 'రోబో' రూ.130 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఆ స్థాయిలో 'లింగ' కథ లేకపోవడంతో అంతగా ఆదరణ దక్కలేదు.

    ముఖ్యంగా చెంగల్పట్టు, నార్త్‌ఆర్కాడ్‌, సౌత్‌ఆర్కాడ్‌ ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారని ఆరోపణలు వస్తున్నాయి. వారు సోమవారం ఉదయం టీనగర్‌లోని రాఘవేంద్ర కల్యాణమండపం ఎదుట నిరసన తెలపనున్నట్లు మూడురోజుల క్రితం ప్రకటించారు. విషయం రజనీకాంత్‌ దృష్టికి వెళ్లడంతో వారితో చర్చించేందుకు ఒప్పుకున్నారు. ఈ చర్చలు మంగళవారం జరిగే అవకాశముంది.

    ఇలాగే గతంలోనూ.. తన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోతే రజనీకాంత్‌ ఆదుకుంటూ వస్తున్నారు. ప్రారంభం నుంచే ఈ పద్ధతి కొనసాగిస్తున్నారు. రెండో కంటికి తెలియకుండా ఆపన్నహస్తం అందించిన సందర్భాలూ ఉన్నాయి. ఎంతో ఇష్టపడి నటించిన 'రాఘవేంద్ర' కమర్షియల్‌గా కాసులు కురిపించలేకపోయింది. మళ్లీ అదే బ్యానరులో ఆయన పారితోషికం పుచ్చుకోకుండా నటించారని ప్రచారంలో ఉంది. రజనీకాంత్‌ నటించిన 'కుచేలన్‌' (కథానాయకుడు) చిత్రం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడటంతో కొందరు డిస్ట్రిబ్యూటర్లకు పరిహారం అందించారు.

    మరో ప్రక్క తమ తాజా చిత్రం లింగాపై అసత్య ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆ చిత్రాన్ని విడుదల చేసిన వేందర్ మూవీస్ సంస్థ హెచ్చరించింది. రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చిన లింగాపై ఫలితం విషయంలో రకరకాల ప్రచారం సాగుతోంది.

    అలాగే చిత్రం ఆశించిన విధంగా లేదని, రజనీకాంత్, కేఎస్.రవికుమార్ కలయికలో వచ్చిన ముత్తు, పడయప్పాలను పోల్చుకుంటే లింగా ప్రజాద రణ పొందలేదని ఇలా రకరకాల ప్రచారం జరుగుతోంది. అంతేగాక ఆశించిన వసూళ్లు సాధించకపోవడంతో థియేటర్ల యజమాన్యాలు రజనీకాంత్ ను కలిసి నష్ట పరిహారం కోరడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నారు. దీంతో వేందర్ మూవీస్ సంస్థ స్పందించింది.

    వేందర్ మూవిస్ వారు మాట్లాడుతూ... లింగా చిత్రం గురించి తప్పుడు ప్రసారం జరుగుతోందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు అర్ధ సంవత్సర పరీక్షలు జరుగుతుండడం, లింగా చిత్రాన్ని 600 థియేటర్లలో ఒకేసారి విడుదల చేయడం లాంటి కారణాల వలన వసూళ్లు తక్కువగా ఉన్న విషయం వాస్తవమేనని పేర్కొంది.

    ఈ శుక్రవారం నుంచి లింగా చిత్రాన్ని చూడడానికి ప్రేక్షకులు కుటుంబ సమేతంగా తరలి వస్తున్నారని తెలిపింది. వసూళ్లు బాగా పెరిగాయని పేర్కొంది. లింగా చిత్రం గురించి అసత్య ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. లింగా చిత్రాన్ని విమర్శకుల కోసం తీయలేదని చురకలు వేస్తూ అసత్య ప్రచారాలను కేఎస్.రవికుమార్ ఖండించారు.

    Lingaa Collection Issue! Distributors to Meet Rajini Today!

    సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం లింగా. అనుష్క, సోనాక్షి సిన్హాలు హీరోయిన్లు. ఈ చిత్రానికి కేఎస్. రవికుమార్ దర్శకత్వం వహించారు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ చిత్ర ప్రపంచ వ్యాప్త విడుదల హక్కులను ఇరాస్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ సంస్థ నుంచి తమిళనాడు, కేరళ విడుదల హక్కులను వేందర్ మూవీస్ సంస్థ పొందింది.

    చిత్రం కథేమిటంటే...

    లింగా(రజనీ) ఓ చిన్న దొంగ...అతని ఫ్రెండ్స్(సంతానం)తదితరులతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూన్న అతన్ని పబ్లిక్ టీవి రిపోర్టర్ లక్ష్మి(అనుష్క) ఓ సారి జైలు నుంచి బయిటకు తీసుకు వస్తుంది. అయితే ఓ కండీషన్ పెడుతుంది..అదేమిటంటే... శింగనూర్ అనే ఓ గ్రామం వచ్చి అక్కడ అతని తాతగారు రాజా లింగేశ్వర(ఇంకో రజనీ) కట్టించిన గుడిని ఓపెన్ చెయ్యాలని. అయితే మొదట లింగా రిజెక్టు చేస్తాడు...తమని ఈ దొంగతనాలు చేసే స్ధితికి వెళ్ళేలే చేసి, దరిద్రంలో వదిలిన తమ తాత అంటే అసహ్యమని చెప్తాడు.

    అయితే తప్పని సరి పరిస్దితుల్లో అక్కడికి వెళ్తాడు. అక్కడ లక్ష్మి తాతగారు(కె. విశ్వనాధ్) ఆ గుడి గురించి ఓ రహస్యం చెప్తాడు. అది విన్న లింగా ఆ గుడిని ఓపెన్ చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. అయితే లోకల్ ఎంపి నాగ భూషణం(జగపతిబాబు) అతనో దొంగ అని కుదరదంటాడు. ఈ లోగా లింగా తన తాతగారి గురించి ఓ షాకింగ్ నిజం తెలుసుకుంటాడు.

    ఆయన గద్వాల్ రాజా లింగేశ్వరావు అని... ఆ రోజుల్లోనే(1940) కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుకుని వచ్చిన ఓ ఇంజినీంరు అని, మధురై కలెక్టర్ అని అర్దం చేసుకుంటాడు. అంత గొప్ప తన తాత తాము ఎందుకు ఇలా దరిద్రంతో బ్రతకాల్సి వస్తోంది. ఆ గుడికి ఉన్న రహస్యం ఏమిటి...ఇంతకీ తన తాత కట్టించిన డ్యామ్ గురించి అతను ఏం తెలుసుకున్నాడు..ఏం చేసాడు...మిగతా విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

    సెన్సార్ బోర్డ్ నుంచి ‘యు' సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా సుమారు 2,300కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా చేసారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత.

    English summary
    Action drama flick "Lingaa" film, which took good openings, in the first weekend, has witnessed huge drops in its collections during the weekdays. So Linga Distributors meet Rajini today.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X