»   » నష్ట పరిహారం ఇప్పించేందుకు సిద్ధమైన రజనీకాంత్?

నష్ట పరిహారం ఇప్పించేందుకు సిద్ధమైన రజనీకాంత్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రజనీకాంత్ తాజా సినిమా ‘లింగా' బాక్సాఫీసు వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్నిభారీ ధరకు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై గత కొన్ని రోజులుగా డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఆమరణ దీక్షకు కూడ సిద్ధమయ్యారు. చిత్ర నిర్మాత రాక్ లైన్ వెంక‌టేష్ త‌మ‌కేమీ లాభాలు రాలేద‌ని, పంపిణీదారుల‌కు న‌ష్ట‌ప‌రిహారం అందించ‌డం కుద‌ర‌ని ప‌ని అని తెగేసి చెప్పేశారు.

ఇన్నాళ్లు ఇదంతా గ‌మ‌నిస్తున్న ర‌జ‌నీకాంత్ మౌనంగానే ఉంటూ వచ్చారు. అయితే ఆందోళన కారులు నిరసన తీవ్రతరం చేయడంతో రజనీకాంత్ రంగంలోకి దిగారు. గ‌తంలో ఆయ‌న సినిమాలు బాబా, కుచేల‌న్ భారీ న‌ష్టాల్ని మిగిల్చినపుడు పంపిణీదారుల‌కు న‌ష్ట‌ప‌రిహారాన్ని అందించిన సంగతి తెలిసిందే.


అపుడు నష్టపరిహారం చెల్లించే విషయంలో తిరుప్పూర్ సుబ్రమణియం అనే డిస్ట్రిబ్యూటర్ సహాయం తీసుకున్నారు. ఆయన ద్వారానే నష్టపరిహారం ఎంతెంత అందజేయాలనే నివేదిక తెప్పించుకున్నారు. ఇతను రజనీకాంత్‌కు నమ్మకమైన వ్యక్తి. ఇపుడు కూడా రజనీకాంత్ నుండి అతనికి ఫోన్ వెళ్లిందని, అతడు లింగా మూవీ నష్టాల లెక్కలు తేల్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి రజనీకాంత్ తన సొంత డబ్బునే వాళ్లకు నష్ట పరిహారంగా ఇస్తారా? లేక నిర్మాతలతో ఇప్పిస్తారా? అనేది తేలాల్సి ఉంది.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


Lingaa distributors breathe a sigh of relief, makers to settle losses

కాగా, గత కొన్ని రోజుల క్రితం నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ స్పందిస్తూ...2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో సూపర్ స్టార్ రజినీకాంత్ పోటి చేయకుండా అడ్డుకోవడానికి కొందరు ‘లింగా' డిస్ట్రిబ్యూటర్లను పావుల్లా వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలకు సేవ చేయడమే రజనీకాంత్ ధ్యేయమని, డిస్ట్రిబ్యూటర్ల చర్యలు పట్ల రజినీకాంత్ కలత చెందారని తెలిపారు.

English summary
Several distributors of Rajinikanth-starrer "Lingaa", who have been demanding compensation over losses, can finally breathe a sigh of relief as the makers have agreed to look into the losses and settle them.
Please Wait while comments are loading...