»   » నీ తండ్రికి ఆ ఫోటోలు చూపిస్తావా? అంటూ కామెంట్స్: హీరోయిన్ ఘాటు రిప్లై!

నీ తండ్రికి ఆ ఫోటోలు చూపిస్తావా? అంటూ కామెంట్స్: హీరోయిన్ ఘాటు రిప్లై!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా ఇటీవల కాలంలో తన సోషల్ మీడియా పేజీలో పోస్టు చేస్తున్న హాట్ ఫోటోలు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇషా ఇంత హాట్ అండ్ సెక్సీగా అందాలు ఆరబోస్తుంటే కొందరు ఎంజాయ్ చేస్తుంటే... కొందరు మాత్రం మరీ ఇలాంటి ఫోజులా? అంటూ ఆమెను విమర్శిస్తున్నారు.

కొందరు చేస్తున్న కామెంట్లు మరీ దారుణంగా ఉన్నాయి. ఆమెను నీతి తప్పిన స్త్రీగా అభివర్ణిస్తూ తిట్టి పోస్తున్నారు. ఆ విమర్శలను ఆమె పెద్దగా పట్టించుకోలేదు కానీ... ఇటీవల తాను ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా పెట్టిన ఓ పోస్టు పట్ల ఓ వ్యక్తి స్పందించిన తీరుపై ఇషా గుప్తా ఫైర్ అయింది.

తన తండ్రిని గుర్తు చేసుకుంటూ..

తన తండ్రిని గుర్తు చేసుకుంటూ..

‘ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ కూతురును అయినందకు గర్వంగా ఉంది. ఆఫ్ స్క్రీన్ రియల్ హీరోలు వారే. దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తున్న వారికి సెల్యూట్' అంటూ ఇటీవల ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ఇషా గుప్తా ఓ పోస్టు చేసింది.

ఓ వ్యక్తి స్పందిస్తూ...

ఓ వ్యక్తి స్పందిస్తూ...

ఎయిర్ ఫోర్స్ డే గురించి ఇషా గుప్తా పెట్టిన పోస్టుపై ఓ వ్యక్తి స్పందిస్తూ..... ‘నువ్వు ఎప్పుడూ స్కిన్ షో ఎందుకు చేస్తున్నావు? ఇది నీ పర్సనల్ అని నాకు తెలుసు.... కానీ మీ నాన్న నువ్వు పోస్టు చేసిన అలాంటి ఫోటోలు చూస్తే ఎలా ఫీలవుతారో ఊహించుకో' అంటూ ఓ కామెంట్ పెట్టాడు.

ఘాటుగా రిప్లై ఇచ్చిన ఇషా

ఘాటుగా రిప్లై ఇచ్చిన ఇషా

నీ లాంటి వారికి సోల్జర్స్ అవసరం ఏమిటో కూడా తెలియదు. నా కళ్లు తెరిపించావు. నన్ను మరింత జాగృతం చేశావు అని అర్థం వచ్చేలా ఇషా రిప్లై ఇచ్చింది.

అతడి నోరు మూయించింది

అతడి నోరు మూయించింది

తనను నీతి తప్పిన స్త్రీగా ట్రోల్ చేసే ప్రయత్నం చేసిన ఆ వ్యక్తి మళ్లీ మారు మాట్లడకుండా ఇషా రిప్లై ఇచ్చింది.

ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ డాటర్

ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ డాటర్

తన తండ్రిని చూసి గర్విస్తున్నాను.... అని ఇషా గుప్తా చేసిన పోస్టుకు, తన వృత్తి పరమైన ఫోటోలకు లింక్ పెట్టి మాట్లాడం సరికాదు అనేది పలువురి వాదన.

ఆ ఫోటోలను ఉద్దేశించే..

ఆ ఫోటోలను ఉద్దేశించే..

ఈ మధ్య కాలంలో ఇషా గుప్తా సోషల్ మీడియాలో తన లింగరీ ఫోటోస్, బికినీ ఫోటోస్, టాప్ లెస్ ఫోటోలను పోస్టు చేస్తోంది. ఆ ఫోటోలను ఉద్దేశించే సదరు వ్యక్తి ఆ కామెంట్స్ చేశాడు.

లైక్ ఎ బాస్

లైక్ ఎ బాస్

సోషల్ మీడియాలో తన ఫోటోల గురించి ట్రోల్ చేస్తున్న వారికి ఏ మాత్ర తత్తరపాటు పడకుండా ఆమె లైక్ ఎ బాస్ తరహాలో రిప్లై ఇస్తోందని అంటున్నారు.

ట్వీట్స్

ట్వీట్స్

ఈ మధ్య సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ట్రోల్ చేస్తూ పోస్టు చేయడం చాలా మందికి టైమ్ పాస్ అలవాటుగా మారిందని.... ఆయా స్టార్స్ అభిమానులు చెబుతున్నమాట.

ఆలోచించండి...

ఆలోచించండి...

ఇషా గుప్తా ఇచ్చిన రిప్లై తర్వాత..... చాలా మంది ట్రోలర్స్ ఏదైనా కామెంట్స్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇషా తగిన రిప్లై ఇచ్చిందని ఆమె అభిమానులు అంటున్నారు.

ప్రతి సెలబ్రిటీ..

ప్రతి సెలబ్రిటీ..

సోషల్ మీడియాలో తమను ట్రోల్ చేస్తున్న వారికి ప్రతి సెలబ్రిటీ ఇషా గుప్తా తరహాలో గట్టిగా సమాధానం చెప్పాలని, అప్పుడే ఇలాంటివి ఆగుతాయని అంటున్నారు.

English summary
Nobody can mess with Esha Gupta as her her tweets show she doesn't take unwanted opinions and negativity for granted and gives it back right then and there for those trolls who try to slut shame her for posting lingerie and bikini pictures. On the occasion of Air Force Day, she tweeted, "Proud to be an Airforce officers daughter, the real heroes are off the screen #AirForceDay salute to all protecting our nation."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu