»   » బాలయ్య ‘లయన్’ ఆడియో రిలీజ్ డేట్ ఖరారైంది

బాలయ్య ‘లయన్’ ఆడియో రిలీజ్ డేట్ ఖరారైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సత్య దేవ దర్శకత్వంలో ‘లయన్' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ఆడియో రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. మార్చి 28 ఆడియో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గతేడాది ఇదే రోజున ‘లెజెండ్' సినిమా విడుదలై హిట్ట కొట్టన సంగతి తెలిసింద.

వాస్తవానికి ఈ చిత్రాన్ని ‘లెజెండ్' సెంటిమెంటును రిపీట్ చేస్తూ మార్చి 28నే విడుదల చేయాలనుకున్నారు. అయితే పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి కాక పోవడంతో ఏప్రిల్ 28కి సినిమా వాయిదా వేసారు. అయితే లెజెంట్ హిట్ సెంటిమెంటును మిస్ కాకుండా ఉండటానికి మార్చి 28న ఆడియో విడుదల ప్లాన్ చేసారు.

'Lion' Audio Release Date confirmed!

‘లెజెండ్' చిత్రం పొద్దుటూరులో ఇంకా నడుస్తోంది. ఈ నేపత్యంలో ‘లెజెండ్' 365 డేస్ సెలబ్రేషన్స్ కూడా ‘లయన్' ఆడియో వేడుక వేదికపై జరుపనున్నారు. బాలయ్యతో భారీ కేక్ కట్ చేయించనున్నారు. ఈ ఆడియో వేడుక హైదరాబాద్ లో భారీగా ప్లాన్ చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి అభిమానులు తరలిరానున్నారు.

లయన్ సినిమా విషయానికిస్తే....
బాలయ్య సరసన తొలిసారి త్రిష ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్.ఎల్.వి.సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్నారు. చంద్రమోహన్, జయసుధ, ప్రకాశ్‌రాజ్, అలీ, గీత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ప్రసాద్, సంగీతం: మణిశర్మ, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: రుద్రపాటి ప్రేమలత, దర్శకత్వం: సత్యదేవా.

English summary
Last year Balakrishna got a biggest block buster by releasing his movie "Legend" on march 28th, So they planned to repeat this sentiment by releasing 'Lion' movie on the same date. But post production work was still going on, so it was postponed to april 28. But they won't miss "Legend" sentiment, Now they are planning to release 'Lion' audio on Mar 28th.
Please Wait while comments are loading...