»   » బాలయ్య ‘లయన్’ మేకింగ్ (వీడియో)

బాలయ్య ‘లయన్’ మేకింగ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘లయన్' చిత్రం ఈ రోజు గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో కూడా విడుదల చేసారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.


బాలకృష్ణ నటించిన 98వ చిత్రం ‘లయన్‌'. నూతన దర్శకుడు సత్యదేవ్‌ డైరెక్షన్‌లో రూపొంది ఈ రోజు విడుదలయింది. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం బోస్(బాలకృష్ణ) పాత్ర చుట్టూ తిరుగుతుంది. కోమాలో ఉన్న బోస్...పద్దెనిమిది నెలల తర్వాత బయిటకు వస్తాడు. అతను రికవరీ కాగానే అందరూ అతన్ని గాడ్సే అనుకుంటూంటారు. అప్పుడు బోస్..తాను గాడ్సే ని కానని... తనకో కథ ఉందని చెప్తాడు. ఇంతకీ బోస్ ఎవరు...గాడ్సే కు ...సంభధం ఏమిటి...ఈ కన్ఫూజన్ ఏంటి... రాధికా ఆప్టే, త్రిష లకు కథలో పాత్రలేమిటి...అనేది మిగతా కథ.

Lion Movie Making video

నిజాయతీని నమ్ముకొన్న సీబీఐ అధికారి అతను. అయితే 'చట్టం తనపని తాను చేసుకుపోతుంది..' తరహా రొటీన్‌ డైలాగులు చెప్పడు. చట్టం కంటే వేగంగా స్పందిస్తాడు. న్యాయస్థానాలు, న్యాయశాస్త్రాలపై నమ్మకం ఉన్నా.. తనే ఓ న్యాయస్థానమై న్యాయమూర్తిగా తీర్పులిచ్చాడు. దుర్మార్గుల్ని శిక్షించాడు. అతని కథేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

English summary
Watch Lion Movie Making. Starring Balakrishna, Trisha Krishnan, Prakash Raj, Jayasudha, Geeta, Chandra Mohan among others. This movie is Directed by Sathya Deva and Produced by Rudrapati Ramana Rao Under The Banner SLV Cinema. Music of the film composed by Mani Sharma.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu