»   » బూతు సీన్లు, వాళ్లని కించపరిచేలా సినిమా ఉందని... సెన్సార్ సర్టిఫికెట్ రిజెక్ట్!

బూతు సీన్లు, వాళ్లని కించపరిచేలా సినిమా ఉందని... సెన్సార్ సర్టిఫికెట్ రిజెక్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత, జాతీయ అవార్డ్ గ్రహీత ప్రకాశ్ ఝా నిర్మాణ సారధ్యంలో రూపొందిన 'లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా' చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని రిజక్ట్ చేస్తూ కేంద్రసెన్సార్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది.

స్త్రీల స్వేచ్ఛ ప్రధానంగా ఫోకస్ చేస్తూ మహిళా దర్శకురాలు అలంకృత‌ శ్రీవాస్తవ దర్శకత్వంలో 'లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా' చిత్రం తెరకెక్కింది. అయితే సినిమాలో ఓ సామాజిక వర్గానికి చెందిన డ్రెస్ కోడ్ గురించి వివాదాస్పదంగా సీన్లు ఉండటం, సెస్స్ సీన్లు, అభ్యంతరకర పదజాలంతో కూడిన డైలాగులు ఉన్న నేపథ్యంలో నిబంధన 1 ఎ, 2 (7, 9, 10, 11, 12), 3 ఎ ప్రకారం సర్టిఫికెట్ నిరాకరించినట్లు సెన్సార్ బోర్డ్ తేల్చి చెప్పింది.

rn

ప్రకాష్ ఝా

అయితే ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని రిజెక్ట్ చేయడంపై ప్రకాష్ జా తీవ్రంగా స్పందించారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను దేశం ప్రోత్సహిస్తుంటే అసౌకర్యమైన కథలంటూ సినిమా తీసేవారిని సెన్సార్ బోర్డ్ నిరుత్సాహానికి గురిచేస్తుందని ఆయన మండి పడ్డారు.

పితృస్వామ్యాన్ని ఛాలెంజ్ చేయడం వల్లే

పితృస్వామ్యాన్ని ఛాలెంజ్ చేయడం వల్లే

దర్శకురాలు అలంకృత‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ... ‘పితృస్వామ్యాన్ని ఛాలెంజ్ చేస్తూ మహిళలు తమ స్వరం వినిపించే ఒక శక్తివంతమైన స్త్రీవాద సినిమా. అందుకే వారు సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారని భావిస్తున్నాను. ఒక ఫిల్మ్ మేకర్ గా నేను కథ తరుపున చివరి వరకు పోరాడతాను' అని తెలిపారు.

ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు

ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు

గ్లాస్గో చిత్రోత్సవంలో ఫిబ్రవరి 24 ప్రదర్శితమైన ఈ సినిమా పలువురి ప్రశంసలు పొందినట్లు దర్శకురాలు అలంకృత‌ శ్రీవాస్తవ వెల్లడించారు. అలాగే ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌లో లింగసమానత్వంలో ఉత్తమ చిత్రంగా ఆక్సోఫామ్ అవార్డుతోపాటు టోక్యో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్పిరిట్ ఆఫ్ ఆసియా ప్రైజ్ గెలుపొందినట్లు ఆమె తెలిపారు.

ముఖ్య పాత్రలు

ముఖ్య పాత్రలు

లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా చిత్రంలో కొంకణాసేన్ శర్మ, రత్నపాఠక్‌ షా, అహానా కుమ్రా, ప్లబితా బోర్తాకూర్ ముఖ్య పాత్రల్లో నటించారు. స్వచ్ఛ కావాలని కోరుకునే నలుగురు మహిళల చూట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

English summary
The Censor Board is back to square one with its 'sanskaari' moral high values and has rejected Prakash Jha's upcoming controversial film 'Lipstick Under My Burkha' and left it high and dry with no certification.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X