»   » సెక్స్, అశ్లీలం, బూతు...(‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా’ ట్రైలర్)

సెక్స్, అశ్లీలం, బూతు...(‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా’ ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: 'లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా' పేరుతో బాలీవుడ్లో రూపొందిన సినిమా వివాదాస్పదం సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సెక్స్, అశ్లీలం, ఓ వర్గాన్ని కించ పరిచే సీన్లు ఉన్నాయంటూ సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి కేంద్ర సెన్సార్ బోర్డ్ నిరాకరించింది.

ఈ సినిమా విషయంలో కొంత కాలంగా దర్శక నిర్మాతలు..... సెన్సార్ బోర్డు సభ్యులకు వార్ జరుగుతూనే ఉంది. ఎట్టకేలకు ఈ సినిమాకు క్లియరెన్స్ లభించింది. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. కొంకనా సేన్ శర్మ, పాఠక్, అహనా కుమ్రా, ప్లబితా బోర్థకుర్, విక్రాంత్ మాసీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

లేడీ ఓరియెంటెడ్ మూవీ

లేడీ ఓరియెంటెడ్ మూవీ

‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా' అనేది లేడీ ఓరియెంటెడ్ మూవీ. మహిళా దర్శకురాలు అలకృత శ్రీవాస్తవ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ ఫిల్మ్ మేకర్, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్ ఝా నిర్మాణ సారధ్యంలో రూపొందింది. తన సినిమాను రిలీజ్ చేసుకోవడానికి కొంతకాలంగా ప్రకాష్ ఝా సెన్సార్ బోర్డుతో ఫైట్ చేసి సక్సెస్ అయ్యారు.

సినిమా దేని గురించి?

సినిమా దేని గురించి?

ఫెమినిజం కాన్సెప్టుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. స్వేచ్ఛ కావాలని కోరుకునే నలుగురు మహిళల చూట్టూ ఈ సినిమా తిరుగుతుంది. మహిళలు ఈ సమాజానికి, ఇక్కడి కట్టుబాట్లకు లోబడి తమ కోరికలను అణచుకుని ఎలా మదన పడుతున్నారు, మగవారిలాగే వారికి కూడా ఎన్నో ఆశలు, ఆకాంక్షలు ఉంటాయని చెప్పే ప్రయత్నం చేశారు.

ట్రైలర్లో సెక్స్, అశ్లీలం

ట్రైలర్లో సెక్స్, అశ్లీలం

ట్రైలర్ చూడటానికి చాలా దారుణంగానే ఉంది. కథలో భాగమే కాబట్టి అశ్లీలం, సెక్స్ లాంటివి సినిమాలో చూపించారు. సినిమా కథ తిరిగేదే అలాంటి అంశాల చుట్టు. అందుకే రియాల్టీకి దగ్గరగా ఈ సినిమాను తెరకెక్కించారు.

ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు

ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు

గ్లాస్గో చిత్రోత్సవంతో పాటు పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ఈ సినిమా పలువురి ప్రశంసలు పొందినట్లు దర్శకురాలు అలంకృత‌ శ్రీవాస్తవ వెల్లడించారు. అలాగే ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌లో లింగసమానత్వంలో ఉత్తమ చిత్రంగా ఆక్సోఫామ్ అవార్డుతోపాటు టోక్యో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్పిరిట్ ఆఫ్ ఆసియా ప్రైజ్ గెలుపొందినట్లు ఆమె తెలిపారు.

రిలీజ్ డేట్

జులై 21న సినిమాను దేశ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఇలాంటి సినిమాకు బాక్సాఫీసు వద్ద రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

English summary
The most controversial film of the year, Lipstick Under My Burkha's trailer is out. After a long battle with the Central Board of Film Certification, the film is finally going to see the light of the day. The film stars Konkona Sen Sharma, Ratna Pathak Shah, Aahana Kumra, Plabita Borthakur and Vikrant Massey.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu