»   » వాలంటైన్ డేకి ఆడియో లాంచ్ (ఫోస్టర్)

వాలంటైన్ డేకి ఆడియో లాంచ్ (ఫోస్టర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విభిన్నతకు పెద్ద పీట వేస్తూ...ఫార్ములా సినిమాలకు దూరం జరుగుతూ వస్తున్న హీరో నిఖిల్. ఆయన కొత్త చిత్రం విడుదల అవుతోందంటే ఓ వర్గంలో ఆసక్తి. ఆ ఆసక్తితో తనకంటూ ఓ వర్గాన్ని రెడీ చేసుకున్నారు. ఆ వర్గాన్ని నిరుత్సాహ పరచకుండా డిఫెరెంట్ స్టోరీలు ఎంచుకుంటుున్నారు. తను ఎంచుకున్న ‘స్వామి రారా', ‘కార్తికేయ' సినిమాల కాన్సెప్ట్ కొత్తగా ఉండడమే కాకుండా ప్రెజెంటేషన్ కూడా ఆడియన్స్ ని మెప్పించడంతో ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ అయ్యాయి. ఇదే తరహాలో నిఖిల్ ట్రై చేస్తున్న మరో సినిమా ‘సూర్య vs సూర్య'.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ ఇటీవలే విడుదలై అందరి చేత సూపర్బ్ అనిపించుకుంది. అంతే కాకుండా ఈ సినిమాలోని ఓ పూర్తి పాటని ఇటీవలే రిలీజ్ చేసారు. తాజా సమాచారం ప్రకారం ‘సూర్య vs సూర్య' ఆడియోని వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నారు. అలాగే సినిమాని ఫిబ్రవరి చివర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడుగా మారుతున్న ఈ సినిమాలో త్రిదా చౌదరి హీరోయిన్ గా కనిపించనుంది. సరికొత్త కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ మధుబాల ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది.


Listen To Surya Vs Surya On Valentines Day

ప్రస్తుతం నిఖిల్ తన ‘సూర్య vs సూర్య' డబ్బింగ్ పనులలో బిజీగా వున్నాడు. ఈ చిత్రంలో ‘పోర్ఫీరియా' అనే కొత్తరకం జబ్బుతో బాధపడుతున్న వ్యక్తిగా నిఖిల్ కనిపించనున్నాడు. ‘స్వామి రారా', ‘కార్తికేయ' వంటి విజయాలతో నిఖిల్ తన తదుపరి ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచుకుంటూ వచ్చాడు. తన తదుపరి ప్రాజెక్ట్ లు ఎక్కడా తడబడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. డబ్బింగ్ పనులను ఈ నెలలో సినిమాను విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బెంగాళీ భామ త్రిధా చౌదరి ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయంకానుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు.


దర్శకుడు మాట్లాడుతూ ''పార్ఫీనియా అనే అరుదైన వ్యాధితో బాధపడే సూర్య అనే కుర్రాడి కథ ఇది. తనకు సూరీడంటే భయం. ఆ యువకుడు వెలుగు చూడలేడు. అందుకే రాత్రుళ్లు బయటకు వస్తాడు. ఇలాంటి చిత్రమైన సమస్యతో తన లక్ష్యాన్ని ఎలా సాధించాడో తెరపైనే చూడాలి. ఈ నెలాఖరున చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.


నిఖిల్ మాట్లాడుతూ.... అతని పేరు సూర్య. తనకు శత్రువు కూడా సూర్యనే. సూర్య అంటే వ్యక్తి కాదు. సౌరశక్తి. అదేనండీ.. సూర్యుడు. వీరిద్దరి మధ్య జరిగే కథే మా 'సూర్య వర్సెస్‌ సూర్య' అంటున్నారు నిఖిల్‌.

English summary
Here is the Nikhil's Surya Vs Surya, Audio Launch Date poster. Surya vs Surya Audio is coming on the eve of Valentines Day.
Please Wait while comments are loading...