»   »  గడగ్గాయే : మహేష్ ని ఇంటర్వూ చేసిన చిన్నారి(వీడియో)

గడగ్గాయే : మహేష్ ని ఇంటర్వూ చేసిన చిన్నారి(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మహేష్ బాబుని కలవటం చాలా మందికి డ్రీమ్. అలాంటిది ఆయన్ను ఇంటర్వూ చేసే అవకాసం ఓ చిన్నారికి వస్తే...ఊహించండి ఎలా ఉంటుందో. తాజాగా అలాంటి అదృష్టమే అవంతిక కు దక్కింది..ఇంతకి ఆ అవంతిక ఎవరూ అంటారా... మహేష్ వీరాభిమాని అయిన ఓ చిన్న అమ్మాయి.

ఈ అబిమాని..తాజాగా మహేష్ ని ఇంటర్వ్యూ చేసి తన మనసులోని మాటలను మహేష్ తో పంచుకుంది.. రెగ్యులర్ గా మీడియా వ్యక్తులు చేసే ఇంటర్వూల కన్నా ఈ ఇంటర్వూనే చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. ఇంతకి ఆమె మనసులో ఏముంది..? ఏమి అడిగిందో మీరే ఆ ఇంటర్వ్యూ చూడండి..

ఈ ఇంటర్వూ చేస్తున్నప్పుడు ఆమె చాలా కాన్ఫిడెంట్ గా ఉండటం మీరు గమనించవచ్చు. అలాగే ఆమె అడిగిన ప్రశ్నలు కూడా డొంక తిరుగుడు కాకుండా, సూటిగా సుత్తిలేకుండా ఉండటం గమనించవచ్చు.

Little Fan Avanthika interviews Mahesh Babu!

బ్రహ్మోత్సవంలో అంతమంది నటీనటులతో నటిస్తూంటే మీ ఎక్సపీరియన్స్ ఏమిటి..,మీ పిల్లలతో కలిసి మీరు ఎప్పుడైనా యానిమేషన్ ఫిల్మ్ లు చూసారా..సూపర్ హీరో సినిమా చేయాలని మీకు ప్లాన్స్ ఉన్నాయా, స్ట్రీట్ ఫుడ్ గురించి, మీరు నటుడు కాకపోతే ఏ వృత్తిని ఎంచుకునే వారు, సినిమా సెట్ లో మీ మొదటి ఎక్సపీరియన్స్ చెప్పండి, మోస్ట్ డిజైరబుల్ పర్శన్ గా ఎంపిక కావటం పట్ల మీ అనుభూతి, పిల్లలకు, మిమ్మల్ని అనుసరించి,ఫాలో అయ్యేవారికి మీ సలహా..ఇలా వరసపెట్టి అడిగేసింది. గడుగ్గాయే..

ప్రస్తుతం మూవీ టీం అంతా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. మే 20 'బ్రహ్మోత్సవం' చిత్రం విడుదలవుతోంది. సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు సంబంధించిన 'మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్', పివిపి సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

వినోదాత్మకంగా నడిచే కుటుంబ కథాచిత్రమిది. ఉమ్మడి కుటుంబంలోని సంతోషాలకు ప్రతిరూపంగా ఈ చిత్రం ఉంటుంది. సత్యరాజ్, జయసుధ, నరేష్, రేవతి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

English summary
Avantika, the cute fan of Mahesh get an opportunity to meet Mahesh and interview the Superstar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu