»   » ‘బాహుబలి’ ఆడియో వేడుక

‘బాహుబలి’ ఆడియో వేడుక

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుస్క, తమన్నా తదితరులు నటిస్తున్న భారీ చిత్రం ‘బాహుబలి'. ఈచిత్రానికి సంబంధించిన ఆడియో వేడుక శనివారం సాయంత్రం తిరుపతిలోని ఎస్వీయూనివర్శిటీ గ్రౌండ్స్ లో ప్రారంభం అయింది. ఆడియో వేడుకకు అభిమానులు భారీగా తరలి వచ్చారు.

బాహుబలి ఆడియోకు హీరో నాని యాంకరింగ్ చేస్తారని గతంలో రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా అనుకున్న విధంగా మే 31న ఆడియో వేడుక హైదరాబాద్ లో జరిగి ఉంటే నాని వచ్చేవాడేమో! ‘అనుకోకుండా నాని షూటింగులో గాయపడ్డారు. తిరుపతిలో జరుగుతున్న ఆడియో వేడుకకు హాజరు కాలేక పోయాడు. నాని స్థానంలో సుమ యాంకరింగ్ చేస్తోంది.

ఈ ఆడియో వేడుక నిర్వహణను రాజమౌళి బాహుబలి టీం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాజమౌళితో పాటు ప్రధాన యూనిట్ మెంబర్స్ అంతా అక్కడే తిష్టవేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా భద్రతా ప్రణామాల విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు.

English summary
Baahubali - The Beginning Live Audio Launch. Movie starring Prabhas as Sivudu & Baahubali, Rana Daggubati as Bhallaladeva, Anushka Shetty as Devasena, Tamannaah as Avanthika with Ramya Krishna, Nasser, Sathyaraj, Kiccha Sudeepa, Adivi Sesh, Rakesh Varre, Meka Ramakrishna.
Please Wait while comments are loading...