»   » సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, బెయిల్ కోసం హైకోర్టుకు(లైవ్)

సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, బెయిల్ కోసం హైకోర్టుకు(లైవ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను ముంబై సెషన్స్ కోర్టు దేషిగా తేల్చింది. ఈ కేసులో అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సెషన్స్ కోర్టు జడ్జి డి.డబ్ల్యు దేశ్ పాండే తీర్పు వెలువరించారు. దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేనందు మరో రెండు నెలలు జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధించారు. జడ్జి తీర్పు వెలువరించే సమయంలో సల్మాన్ ఖాన్ మొహంలో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ లేదు. తలదించుకుని ఉన్నారు.

కారు నడిపే సమయంలో సల్మాన్ ఖాన్ మద్యం సేవించి ఉన్నాడని కోర్టు స్పష్టం చేసింది. ఆ సమయంలో తాను కారు నడపలేదని, డ్రైవర్ నడిపాడనే సల్మాన్ వాదనను కోర్టు కట్టు కథగా పేర్కొంది. ఆ సమయంలో సల్మాన్ కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని తేల్చింది. సల్మాన్ ఖాన్ మీద ఉన్న 8 అభియోగాలు నిరూపణ కావడంతో కోర్టు అతన్ని దోషిగా ప్రకటించింది. కోర్టు తీర్పు అనంతరం పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఆర్థర్ రోడ్ జైలుకు ఆయన్ని తరలించారు. 

సెషన్స్ కోర్టు తీర్పుపై బెయిల్ కోరుతూ సల్మాన్ ఖాన్ ముంబై హైకోర్టను ఆశ్రయించారు. వెంటనే బెయిల్ పిటీషన్ విచారణ ప్రారంభం అయింది. ఒక వేళ బెయిల్ లభిస్తే సల్మాన్ విడుదల కానున్నారు.

వివిధ నేరాల్లో జైలుకెళ్లిన సినీతారలు...(ఫోటో ఫీచర్)

ఈ కేసులో బెయిల్ కోసం సల్మాన్ ఖాన్ ముంబై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన తరుపు ప్రతినిధులు తెలిపారు.

Live Updates: Actor Salman Khan hit and run case

అంతకు ముందు కోర్టు తనను దోషిగా తేల్చిన వెంటనే సల్మాన్ ఖాన్ కంటతడి పెట్టారు. మరో వైపు ఆయనకు శిక్ష పడకూదని ప్రార్థనలు చేస్తున్న ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు కోెర్టు తీర్పుతో కన్నీటిపర్యంతం అయ్యారు. 

దోషిగా తేల్చిన వెంటనే సల్మాన్ తరుపు లాయర్ శ్రీకాంత్ శివడే ....గతంలో ఇలాంటి కేసుల ఉదహరించి శిక్షను తగ్గించాల్సిందిగా(2 సంవత్సరాలు) కోర్టు కోరారు. సల్మాన్ ఖాన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు, 600 మంది చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలకు సహాయం అందించారని, వీటిని దృష్టిలో పెట్టుకుని రెండేళ్లకు మంచి జైలు శిక్ష వేయరాదని కోర్టుకు విన్నవించారు. 

Live Updates: Actor Salman Khan hit and run case

సల్మాన్ ఖాన్ కోర్టుకు హాజరు కావడానికి ముందు ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ కూడా సల్మాన్ ఇంటికి చేరుకున్నారు. సల్మాన్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు షారుక్ అక్కడికి వెళ్లినట్లు సమాచారం. తీర్పు వెలువడిన అనంతరం షారుక్ కూడా బాధ పడ్డట్లు తెలుస్తోంది.

కోర్టు తీర్పు అనంతరం సల్మాన్ ఖాన్ సోదరుడు సొహైల్ ఖాన్ కంటతడి పెడుతూ కోర్టు నుండి వెళ్లి పోయారు.

సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష ఎక్కువ కాలం పడకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు నటి హేమా మాలిని మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

తానే కారు నడిపాను అంటూ తప్పుడు వాంగ్మూలం ఇచ్చిన సల్మాన్ ఖాన్ డ్రైవర్ అశోక్ సింగ్ ను కూడా కోర్టు శిక్షించే అవకాశం ఉంది.

Live Updates: Actor Salman Khan hit and run case

కాగా....తప్పు చేసి ప్రాణాలు బలిగొన్న సల్మాన్ ఖాన్ కేసు విషయంలో అతని మద్దుతు ఇస్తున్న పలువురు సెలబ్రిటీలకు పోలీసులు చురకలంటిస్తున్నారు. ఇలా చేయడం సరికాదని అంటున్నారు.

నిర్మాతల్లో ఆందోళన...

కోర్టు తీర్పు తో బాలీవుడ్ వర్గాల్లో నెలకొంది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపతున్నారు. ఆయనకు జైలు శిక్ష పడితే షూటింగులు ఆగిపోనున్నాయి. ఆయా సినిమాలపై నిర్మాతలు దాదాపు రూ. 200 కోట్ల పెట్టబడి పెట్టారు. నిర్మాతలకు భారీ నష్టం తప్పదు.

గత విచారణ ఇలా సాగింది...
2002 సెప్టెంబర్ 28న అర్ధరాత్రి ముంబైలో ఓ హోటల్ నుంచి సల్మాన్ కారులో వస్తుండగా రోడ్డుపై నిద్రిస్తున్నవారిపైకి ఆ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా నలుగురు గాయపడ్డారు. కేసును విచారణకు స్వీకరించిన స్థానిక కోర్టు.. ఇప్పటివరకు 25 మంది నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసింది.

Live Updates: Actor Salman Khan hit and run case

సల్మాన్ ఖాన్ కారు డ్రైవర్ విచారణ సందర్భంగా కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చాడు.‘ముంబైలో అర్థరాత్రి ప్రమాదం జరిగిన సమయంలో కారును తానే నడుపుతున్నానని, సల్మాన్ నడపలేదని స్పష్టం చేసాడు. ఈ కేసుకు సంబంధించిన సల్మాన్ ఖాన్ డ్రైవర్కో ర్టుకు హాజరు కావడం అదే తొలిసారి.

ఇది డమ్మీ సాక్ష్యం అని పబ్లిస్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ వాదించారు. ప్రధాన నిందితుడిగా ఉన్న సల్మాన్‌ఖాన్ ఇంతకు ముందు ఎప్పుడూ డ్రైవర్ అశోక్‌సింగ్ పేరును ప్రస్తావించలేదని అన్నారు. క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగానూ జరిగిన వాదనలను పిపి కోర్టు దృష్టికి తెచ్చారు. తాజాగా కోర్టు సల్మాన్ ను దోషిగా తేల్చింది.

English summary
Check out Live Updates: Actor Salman Khan hit and run case.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu