»   » వరుణ్ తేజ్ ‘లోఫర్’ మూవీ షూటింగ్ పరిస్థితి ఏంటి?

వరుణ్ తేజ్ ‘లోఫర్’ మూవీ షూటింగ్ పరిస్థితి ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా సినిమా ఖరారైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘లోఫర్' అనే టైటిల్ కూడా ఖరారు చేసారు. తాజాగా ఈ చిత్రం షూటింగుకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. మరో వారంలో షూటింగ్ మొదలు కాబోతోంది.

‘లోఫర్' మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై 9 నుండి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగుతుంది. సెకండ్ షెడ్యూల్ జులై 20 జోధాపూర్ లో మొదలు కానుంది. ఆగస్టు 20 వరకు అక్కడే షూటింగ్ జరుగనుంది. త్వరలో అపీషియల్ ప్రకటన వెలువడనుంది.

ఈ చిత్రం మాస్ మసాలా ఎంటర్టెనర్‌గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ ను ఫుల్ ఎనర్జీతో చూపించబోతున్నాడు. ఫెమినా మిస్ ఇండియా 2013 రన్నరప్ దిషా పతాని ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడీగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సునిల్ కశ్యప్ సంగీతం అందించబోతున్నాడు. బ్రహ్మానందం, రేవతి, పోసాని కృష్ణ మురళి తదితరులు ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు.

Loafer movie shooting details

వరుణ్ తేజ ప్రస్తుతం చేస్తున్న చిత్రం విషయానికి వస్తే..డైరక్టర్ క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ హీరోగా కంచె టైటిల్ తో చిత్రం నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కంచె అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసి లాంచ్ చేసారు. ఇది పీరియడ్ డ్రామా. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా ఎంపికయ్యింది. మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రజ్ఞ జైస్వాల్, తెలుగులో అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు' సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో ఈ సినిమా కథ ఉంటుందట. పీరియాడికల్ డ్రామాగా రూపొందబోయే ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

English summary
The regular shooting of Varun Tej’s Loafer will kick start from July 9th, 2015 and this will continue for 3 days in Hyderabad. The second schedule will start in Jodhapur on July 20th and it will continue till August 20th.
Please Wait while comments are loading...