»   » ఎన్టీఆర్ 3డి విగ్రహంతో సెల్ఫీ (ఫొటో)

ఎన్టీఆర్ 3డి విగ్రహంతో సెల్ఫీ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : లెజండరీ నటుడు నందమూరి తారకరామారావు తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయారు. ఆయన్ని మరింతగా మన జ్ఞాపకాల్లో ఉంచేందుకు ఆయన కుటుంబం ఎన్టీఆర్ కోసం ఓ మ్యూజియం ను ఏర్పాటు చేస్తోంది.

ఈ విషయాన్ని తెలియచేస్తూ నారా రోహిత్...ఈ ఎన్టీఆర్ మ్యూజియంలో పెట్టబోతున్న ఎన్టీఆర్ 3డి విగ్రహంతో కలిసి సెల్ఫీ తీసుకుని తన ట్విట్టర్ ఎక్కౌంట్ లో షేర్ చేసి అభిమానులకు ఆనందం కలగచేస్తున్నారు.

ఈ విగ్రహం స్పెషల్ గా నిలిచిపోతుందని చెప్తున్నారు. దీన్ని 3డి సాప్ట్ వేర్ తో రెడీ చేసారు. మాయాబజార్ లోని ఎన్టీఆర్ ఇమేజ్ తీసుకుని కృష్ణుడుగా ఆయన్ని ఇలా త్రీడిలో మనకు అందిస్తున్నారు. ఈ విగ్రహం చూసిన వారు ఆనందంతో మురిసిపోయే రీతిలో ఉంటుందని చెప్తున్నారు.

Lokesh Nara selfie with 3D printed NTR

ఇక ఈ విగ్రహం ఎప్పుడు ఇనాగరేట్ చేయబోతున్నారనే విషయాన్ని మాత్రం నారా లోకేష్ తెలియచేయలేదు. ఇప్పటికి ఈ సెల్ఫీతో సరిపెట్టుకుంటే త్వరలోనే ఈ విగ్రహానికి సంభందించిన పూర్తి వివరాలు అందచేస్తాం మరి.

English summary
Lokesh Nara ‏tweeted:" My selfie with 3D printed NTR as Sri Krishna from Maya Bazaar. Our first step towards building NTR Museum. "
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu