»   » బద్రినాథ్ కి సెవెన్ క్రేజీ హైలెట్స్ తో రికార్డ్ బ్రేక్..ఎలాగో ఓ లుక్కేయండి..!

బద్రినాథ్ కి సెవెన్ క్రేజీ హైలెట్స్ తో రికార్డ్ బ్రేక్..ఎలాగో ఓ లుక్కేయండి..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా టాలీవుడ్ కమర్షియల్ నెం.1 డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్ధ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై 'మగధీర', '100% లవ్' చిత్రాల ఘన విజయాల తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న భారీ చిత్రం 'బద్రీనాథ్' జూన్ 10 న భారీ గా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి స్వరవాణి ఎం.ఎం.కీరవాణి స్వరపరచిన బాణీలను ఇటీవలే మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా అత్యంత భారీగా విడుదల చేసారు. ఈ భారీ ఫంక్షన్ లో మెగా అభిమానులకు చిరు కానుకగా బద్రీనాథ్ చిత్రం ట్రైలర్స్ ని, మేకింగ్ ని ప్రదర్శించారు.

ఎప్పటికప్పుడు ప్రమోషన్ లో కొత్తపుంతలు తొక్కే గీతా ఆర్ట్స్ ఈ సారి ఏకంగా 1000 ధియేటర్స్ లో ఈ చిత్రం యొక్క ట్రైలర్స్ ని ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రానికి సంబంధించి అనేక హై లైట్స్ వున్నాయి. 1. 22భారీ సెట్స్ లో షూటింగ్ చిత్రీకరణ 2. 3కోట్లతో ఓంకారేశ్వరీ" సాంగ్ చిత్రీకరణ 3. ఉత్కంఠభరితమైన పీటర్ హెయిన్స్ యాక్షన్ సీన్స్ 4. అల్లు అర్జున్ వర్క్ డెడికేషన్ 5. వివి వినాయక్ డైనమిక్ టేకింగ్ 6. రికార్డు బ్రేకింగ్ కథారచయిత చిన్నికృష్ణ 7. ఎక్కడా రాజీలేని గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వ్యాల్యుస్ ఇన్ని క్రేజి హైలెట్స్ తో రూపుదిద్దుకుంటోన్న బద్రినాథ్ సినిమాతో ఎలాగైనా అల్లు అర్జున్ రేంజ్ పెంచడానికి ఉపయోగపడతాయని, బద్రినాథ్ సినిమాతో అల్లు అర్జున్ ని స్టార్ ని చేయాలని అల్లు అరవింద్ తహతహలాడిపోతున్నాడు. అందుకే బద్రినాథ్ కోసం ఎన్నడూ లేనంతగా కష్టపడుతున్నారు. మగధీర కి ముందు కూడా సైలెంట్ గానే ఉన్న అల్లు బృందం ఇప్పుడు మాత్రం విపరీతంగా హడావిడి చేస్తున్నారు..

English summary
Allu Arjun and Tamanna starrer socio fantasy film 'Badrinath' is all set to release on June 10th. We hear the Allu Aravind spent a whooping Rs 3 crore to shoot a song in this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu