»   » ‘లవ్ 4 ఎవర్’ మృదుల

‘లవ్ 4 ఎవర్’ మృదుల

Subscribe to Filmibeat Telugu

లాఫింగ్ వాటర్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై, జయంత్ సి. పరాన్జీ స్వీయదర్శకత్వంలో రూపొందిస్తున్న కొత్త చిత్రం 'లవ్ ఫర్ ఎవర్". ఈ చిత్రం హింది, తెలుగు బాషలలో రూపొపుదిద్దుకొంటున్న విషయం విధితమే. ఈ చిత్రానికి యువ కథానాయిక మృదుల, యువ హీరో రణదీప్ ను పరిచయం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబాయ్ లో జరుగుతోంది. సెప్టెంబర్ 25 వరకూ అక్కడ జరిగే షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుందని దర్శకుడు తెలియజేశారు. ఈ సందర్బంగా జయంత్ సి. పరాన్జీ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ప్రేమని సరికొత్త కోణంలో రూపోందిస్తున్నామన్నారు. ప్రేమ గురించి నా అభిప్రాయాన్ని ఈ చిత్రంలో చూపుతున్నాను. ద్రాక్ష తోటల నేపథ్యంలో రెండు స్వచ్ఛమైన హృదయాల మధ్య జరిగే సునిశితమైన ప్రేమకథ ఇది. 'ఒక తమిళ అమ్మాయి, న్యూయార్క్ అబ్బాయి ప్రేమించుకుంటారు. ఖండాంతర వ్యత్యాసం వున్న ఈ ఇద్దరూ ఎలా ఒకటయ్యారన్నదే ఈ చిత్ర ముఖ్య కథాంశమని తెలియజేశారు. ఇంకా ఈ చిత్రానికి బాలీవుడ్ హాట్ గర్ల్ దీపికా పదుకొనే ఒ ప్రత్యేక పాటని చేయడం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. ఏడేళ్ల తర్వాత జయనన్ విన్సెంట్ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించడం విశేషమని దర్శకనిర్మాతైన జయంత్ సి. పరాన్జీ తెలిపారు. రామ్ సంపత్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. త్వరలో చిత్ర షూటింగ్ ను ముగించుకొని ఆడియో విడుదలకు సిద్ధకాబోతుంది.

Please Wait while comments are loading...