For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దశరధ్ చిత్రం టైటిల్ 'లవ్‌స్టోరీ' కాదు: నాగార్జున

  By Srikanya
  |

  హైదరాబాద్ : దశరథ్‌ దర్శకత్వంలో నేను హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'లవ్‌స్టోరీ' కాదు.. ఇంకా పేరును నిర్ణయించలేదు. పరిణతితో కూడిన లవ్‌స్టోరీ అని నేను అనడంతో అందరూ అదే పేరు అనుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో పూర్తవుతుంది. మంచి సమయాన్ని చూసుకొని విడుదల చేయాలి. చిత్ర పరిశ్రమలో అన్నిటికంటే సినిమా విడుదల సమయమే ముఖ్యం. ఒక్కో సినిమాకి రెండు వారాల వ్యవధైనా ఉంటేనే పరిశ్రమకు మంచి జరుగుతుంది అన్నారు.

  అలాగే వీరభద్రం దర్శకత్వంలో రూపొందే 'భాయ్‌' చిత్రం మాఫియా నేపథ్యంలో సాగుతుందంటూ వార్తలు వస్తున్నాయి. అవి నిజమేమేనా అని మీడియావారు నాగార్జున ని అడగటం జరిగింది. దానికి ఆయన సమాధానమిస్తూ...అస్సలు కాదు. మాఫియా నాయకుల్నీ, వారి దందాల్ని తెరపై చూపించడం నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు. అది సమాజానికి అంత మంచిది కూడా కాదు. 'భాయ్‌' పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం. ఇదివరకు నేను చేసిన 'హలో బ్రదర్‌' సినిమాని గుర్తుకు తెస్తుంది. అలా అంటున్నానని ఇందులో ద్విపాత్రాభినయం ఏమీ చెయ్యడం లేదు అని తేల్చి చెప్పారు.

  ఇక తన తండ్రి ఏఎన్నార్‌, కుమారుడు నాగచైతన్య తో కలిసి చేయబోయే సినిమా ఎప్పుడు ప్రారంభం కానుందో చెపుతూ...'భాయ్‌' తర్వాత సెట్స్‌పైకి వెళ్లేది ఆ చిత్రమే. కథ కూడా నాకు బాగా నచ్చింది. దుర్గా ఆర్ట్స్‌, బెల్లంకొండ సురేష్‌ సంస్థల్లోనూ తదుపరి చిత్రాలు చెయ్యబోతున్నాను. మంచి కథ చెబితే... దర్శకురాలు జయతోనూ ఓ సినిమా చేస్తాను. శేఖర్‌ కమ్ముల కూడా కథ చెబుతానన్నాడు అని తన ప్యూచర్ ప్రాజెక్టుల గురించి చెప్పుకొచ్చారు.

  త్వరలో రిలీజ్ కాబోతున్న ఢమురకం గురించి మాట్లాడుతూ....సోషియో ఫాంటసీ చిత్రంలో నటించాలనే కోరిక నా మనసులో చాలా రోజులుగా ఉంది. కానీ అందుకు తగిన సందర్భం రాలేదంతే. సోషియో ఫాంటసీ సినిమా అంటే... కథను బాగా తెరకెక్కించే దర్శకుడితో పాటు, అభిరుచి ఉన్న నిర్మాత కూడా కావాలి. 'డమరుకం' విషయానికే వస్తే... తొమ్మిది నెలలపాటు కేవలం గ్రాఫిక్స్‌ కోసమే సమయం కేటాయించారు. అంటే నిర్మాతకి ఎంత శ్రద్ధాసక్తులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలా మంచి కథ, దర్శకుడు, నిర్మాత, నటుడు... అందరూ కలిసినప్పుడే భిన్నమైన సినిమాలొస్తాయి అన్నారు.

  English summary
  After mythological film ‘Shirdi Sai’, Nag is coming up with a socio-fantasy film ‘Damarukum’ this month. Right now he is busy filming of his new project with director Dasaradh and Nayantara as his love interest. Initially the title of this film was announced as ‘Love Story’ but it has been changed.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X