»   » ఆ కుటుంబాలపై దాసరి సెటైర్లు లవ్ టచ్ (ఫోటోలు)

ఆ కుటుంబాలపై దాసరి సెటైర్లు లవ్ టచ్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కుటుంబాలుగా వెలుగుగొందుతూ ఇండస్ట్రీని దున్నేస్తున్నవారిపై సెటైర్లు విసిరారు. 'లవ్ టచ్' సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్న ఆయన ప్రస్తుతం పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై తనదైన రీతిలో వాగ్భాణాలు సంధించారు.

'ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఆ కుటుంబాల హవానే నడుస్తోంది. ఒక్కో సినిమాకు భారీగా రూ. 50 కోట్లపైగానే ఖర్చు చేస్తున్నారు. థియేటర్లన్నీ వాళ్ల గుప్పిట్లోనే ఉంటున్నాయి. చిన్న సినిమాలకు థియేటర్లు దొరికే పరిస్థితి లేదు. కొత్త హీరోలు, టెక్నీషియన్స్ వస్తే నిలదొక్కుకోగలరా అనే అనుమానాలు నెలకొన్నాయి. నేను ఇప్పుడు ఇస్ట్రీకి వచ్చి ఉంటే జీవితంలో డైరెక్టర్ ని అయి ఉండేవాన్ని కాదు. అవకాశాలన్నీ ఆ కుటుంబాల వారికే తప్ప వేరే వారికి ఎక్కువగా రావడం లేదనేది నా ఫీలింగ్. అలా అని ఆ కుటుంబాలను నేను తప్పుబట్టడం లేదు. వారు కష్ట పడుతున్నారు. వారి టాలెంట్ తోనే పైకొస్తున్నారు. ఇతరులకు అవకాశాలు రావడం లేదనేదే నా ఆవేదన అంటూ దాసరి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇండస్ట్రీలో భాగమే, తెలంగాణ నుంచి హీరోలు రావాలి అని వ్యాఖ్యానించారు.

'లవ్ టచ్' సినిమా విషయానికొస్తే జయంత్, ధృతి జంటగా శ్రీచంద్ దర్శకత్వంలో ఈచిత్రం రూపొందుతోంది. ఎస్. రత్నమయ్య, ఎల్. ప్రవీణ్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో జరిగిన ఆడియో విడుదల కార్యక్రమానికి దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా హాజరైన సీడీని ఆవిష్కరించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు అందజేసారు.

లవ్ టచ్ ఆడియో విడుదల కార్యక్రమం దృశ్యాలు.

లవ్ టచ్ ఆడియో విడుదల కార్యక్రమం దృశ్యాలు.

లవ్ టచ్ ఆడియో విడుదల కార్యక్రమం దృశ్యాలు.

లవ్ టచ్ ఆడియో విడుదల కార్యక్రమం దృశ్యాలు.

లవ్ టచ్ ఆడియో విడుదల కార్యక్రమం దృశ్యాలు.

English summary
Jayanth, Dhruti starrer 'Love Touch' movie Audio launch held at Ravi Narayana Reddy auditorium in Hyderabad. Dasari Narayana Rao, Damodar Raja Narasimha released the Audio. Director Srichand and Producer S Ratnamayya, L Praveen and Hero Jayanth graced the event.
Please Wait while comments are loading...