»   » వీడియో : లవ్వర్ ఆల్సో, ఫైటర్ ఆల్సో అంటున్న బన్నీ..వినగానే కిక్కిచ్చేలా ఉంది..!

వీడియో : లవ్వర్ ఆల్సో, ఫైటర్ ఆల్సో అంటున్న బన్నీ..వినగానే కిక్కిచ్చేలా ఉంది..!

Subscribe to Filmibeat Telugu
లవ్వర్ ఆల్సో, ఫైటర్ ఆల్సో అంటున్న బన్నీ..వినగానే కిక్కిచ్చేలా ఉంది..!

అల్లు అర్జున్ అభిమానులని ఎప్పుడూ నిరాశ పరచడు. ఎప్పటికప్పుడు తనని తాను అప్డేట్ చేసుకుంటూ ఫాన్స్ కి కిక్కివ్వడంలో బన్నీ తరువాతే ఎవరైనా. అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా. దేశ భక్తికథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇంపాక్ట్ టీజర్ తోనే మిలటరీ మాన్ లుక్ లో బన్నీ అదరగొట్టేసాడు. తాజగా వాలంటైన్స్ డే సందర్భంగా లవ్వర్ ఆల్సో, ఫైటర్ ఆల్సో అంటూ లిరికల్ సాంగ్ ని విడుదల చేసారు. ఈ సాంగ్ కొత్త కొత్తగా ఉంటూ వినగానే ఎక్కేసేలా ఉంది.

లిరిక్స్ అదిరాయి

లవ్వర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అంటూ సొంగ్ ఈ పాటలో లిరిక్స్ కొత్తగా ఉంటూ ఆకట్టుకునే విధంగా ఉన్నాయ్. లిరికల్ వీడియోలో బన్నీ, అను ఇమ్మాన్యుయేల్ స్టిల్స్ రొమాంటిక్ గా ఉన్నాయి.

సంగీత ద్వయం తొలిసారి

సంగీత ద్వయం తొలిసారి

బాలీవుడ్ పాపులర్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. వీరిలో విశాల్ స్వయంగా ఈ పాటకు గాత్రం అందించారు. గతంలో విశాల్ సరైనోడు చిత్రంలో 'అతిలోక సుందరి' అనే పాటని పాటని పాడిన సంగతి తెలిసిందే.


 బన్నీ, అను రొమాన్స్

బన్నీ, అను రొమాన్స్

దేశ భక్తి కథాంశంతో రూపొందుతున్నప్పటికీ ఈ చిత్రంలో బన్నీ, అను మధ్య యువతని ఎంటర్టైన్ చేసే విధంగా రొమాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే వాలంటైన్స్ డే రోజున గురి చూసి మరీ ఈ పాటని వదిలారు.


 ఫస్ట్ ఇంపాక్ట్ వదిలినప్పుడే

ఫస్ట్ ఇంపాక్ట్ వదిలినప్పుడే

ఫస్ట్ ఇంపాక్ట్ పేరుతో నా పేరు సూర్య చిత్ర టీజర్ వదిలినప్పటినుంచే అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఆర్మీ మాన్ గా బన్నీ చేయబోయే సాహసాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.


 యాక్షన్ సీన్స్ ప్రధాన ఆకర్షణగా

యాక్షన్ సీన్స్ ప్రధాన ఆకర్షణగా

వక్కంతం వంశి తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ ని ప్రధాన ఆకర్షణగా మలుస్తున్నారట. వేసవి సందర్భంగా నా పేరు సూర్య చిత్రం ఏప్రిల్ 27 న విడుదల కానుంది.


English summary
Lover Also Fighter Also Lyrical video of Allu Arjun's Naa Peru Surya released. Vishal Shekhar are music directors.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu