»   » అల్లు అర్జున్ అభిమానులకు ప్రేమికుల రోజు గిఫ్ట్!

అల్లు అర్జున్ అభిమానులకు ప్రేమికుల రోజు గిఫ్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో 'నా పేరు సూర్య' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చిత్రం యూనిట్ అభిమానుల కోసం స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేశారు.

‘నా పేరు సూర్య’ సంచలనం.. రికార్డులన్నీ బద్దలు..

ప్రేమికుల రోజు కానుక

ఫిబ్రవరి 14న ‘నా పేరు సూర్య' సినిమాలోని రెండో పాట ‘లవర్ ఆల్సో ... ఫైటర్ ఆల్సో' ను విడుదల చేస్తున్నట్లు అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, విశాల్ శేఖర్ సంగీతమందించారు.

లవ్ సాంగ్

లవ్ సాంగ్

‘లవర్ ఆల్సో ... ఫైటర్ ఆల్సో' పాటను అల్లు అర్జున్, అనూ ఎమ్మాన్యూయేల్‌పై చిత్రీకరించారు. సినిమాలో ఈ లవ్ సాంగ్ హైలెట్ కానుంది. ఈ పాట నాకు ఎంతో నచ్చింది, మీరూ ఈ పాటతో కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాను అని అల్లు అర్జున్ తెలిపారు.

రెస్పాన్స్ అదుర్స్

రెస్పాన్స్ అదుర్స్

గణతంత్ర దినోత్సవం సందర్బంగా ‘నా పేరు సూర్య' పాటను విడుదల చేయగా దానికి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్లు ఆ సినిమా యూనిట్ తెలిపింది.

బన్నీ కెరీర్లో స్పెషల్ మూవీ

బన్నీ కెరీర్లో స్పెషల్ మూవీ

ఈ చిత్రంలో సైనికుడి పాత్రలో కనిపించబోతున్న బన్నీ గతంలో ఏ సినిమాకు చేయనంతగా హార్డ్ వర్క్ చేశాడు. బన్నీ కెరీర్లోనే ఈ చిత్రం ఓ స్పెషల్ మూవీగా కాబోతోంది. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు చూడని మిలటరీ ట్రైనింగ్ బ్యాక్‌డ్రాపుతో ఈ చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తోన్న విషయం తెలిసిందే.

నా పేరు సూర్య

నా పేరు సూర్య

ఈ చిత్రానికి ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి), ఫైట్స్ - రామ్ లక్ష్మణ్, సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి, ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, సినిమాటోగ్రఫి - రాజీవ్ రవి, సంగీతం - విశాల్ - శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు, బ్యానర్ - రామలక్ష్మీ సినీ క్రియేషన్స్, సమర్పణ - k.నాగబాబు, సహ నిర్మాత - బన్నీ వాసు, నిర్మాత - శిరీషా శ్రీధర్ లగడపాటి రచన, దర్శకత్వం - వక్కంతం వంశీ.

English summary
NSNI 2nd Song “LOVER ALSO FIGHTER ALSO “ Releasing on Feb 14th Valentines Day. When I heard this song I instantly loved it. I hope you all connect this song just like I did .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu