»   » చిరంజీవి, ప్రణీత జంటగా ‘లవర్ బాయ్-క్లవర్ అమ్మాయి’

చిరంజీవి, ప్రణీత జంటగా ‘లవర్ బాయ్-క్లవర్ అమ్మాయి’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. వీరి ఆశ ఇప్పుడప్పుడే తీరేట్లు లేదు కానీ...తెలుగు తెరపై మరో చిరంజీవి లవర్ బాయ్‌గా కనిపించబోతున్నాడు. అతనెవరో కాదు ప్రముఖ హీరో అర్జున్ మేనల్లుడు చిరంజీవి.

చిరంజీవి, ప్రణీత జంటగా నటించిన ఓ కన్నడ చిత్రాన్ని 'లవర్ బాయ్-క్లవర్ అమ్మాయి' పేరుతో రైజింగ్ సన్ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత చంద్రకాయల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ప్రశాంత్ రాజ్ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ 'ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్. ప్రణీత గ్లామర్ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చిత్రంలోని పాటలు ఇటీవల విడుదలై విశేష ఆదరణ పొందుతున్నాయి. ఇందులో 'మిల మిల మెరుపుల' అంటూ సాగే పాట మరింతగా ఆకట్టుకుంటోంది' అన్నారు.

అత్తారింటికి దారేది హీరోయిన్ క్రేజ్

అత్తారింటికి దారేది హీరోయిన్ క్రేజ్

నిర్మాత మాట్లాడుతూ ‘‘అత్తారింటికి దారేది' ఫేమ్ ప్రణీత నటించడం వలన ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. త్వరలో సెన్సార్ కార్యక్షికమాలు పూర్తి చేసి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.

హీరో అర్జున్ మేనల్లుడు

హీరో అర్జున్ మేనల్లుడు

ప్రముఖ హీరో అర్జున్ మేనల్లుడు చిరంజీవి. మేనమామ నటవారసత్వాన్ని పునికి పుచ్చుకుని సినిమా రంగంలోకి ప్రవేశించాడు.

లవర్ బాయ్-క్లవర్ అమ్మాయి

లవర్ బాయ్-క్లవర్ అమ్మాయి

చిరంజీవి, ప్రణీత జంటగా నటించిన ఓ కన్నడ చిత్రాన్ని ‘లవర్ బాయ్-క్లవర్ అమ్మాయి' పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగులో నిర్మాత..

తెలుగులో నిర్మాత..

సన్ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత చంద్రకాయల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

రొమాంటిక్ థ్రిల్లర్

రొమాంటిక్ థ్రిల్లర్

ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్. ప్రణీత గ్లామర్ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చిత్రంలోని పాటలు ఇటీవల విడుదలై విశేష ఆదరణ పొందుతున్నాయి. ఇందులో ‘మిల మిల మెరుపుల' అంటూ సాగే పాట మరింతగా ఆకట్టుకుంటోందని దర్శకుడు ప్రశాంత్ రాజ్ తెలిపారు.

ఇతర వివరాలు

ఇతర వివరాలు

ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ రాయ్, సంగీతం:జోష్వా శ్రీధర్, పాటలు:సుమచంద్ర, కె పైడి, మాటలు: నాగరాజు మంచాల, దర్శకత్వం: ప్రశాంత్ రాజ్

English summary
Actress Pranitha, Actor Chiranjeevi starring Lover Boy Clever Ammayi Movie Stills. Directed by Prasanth Raj and produced by Joshua Sridhar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu