»   » కనీసం రామ్ గోపాల్ వర్మ అయినా హిట్ ఇస్తాడా..!?

కనీసం రామ్ గోపాల్ వర్మ అయినా హిట్ ఇస్తాడా..!?

Subscribe to Filmibeat Telugu

లవర్ బాయ్ గా నువ్వేకావాలి, నువ్వులేక నేనులేను అనిపించుకుని అందరికీ ప్రియమైన తరుణ్ ఇప్పుడు తన కెరీర్ లోనే గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. వరస పరాజయాలతో సతమతమవుతున్న తరుణ్ తాజాగా చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి సినిమాతో మన ముందుకు రానున్నాడు. ఈ సినిమా పోస్టర్లు చూస్తే తరుణ్ కన్నా ఇందులో నటిస్తున్న నాయిక విమలా రామన్ కే అధిక ప్రాదాన్యతను ఇస్తున్నట్టు అర్థమవుతోంది. కనీసం విమలా గ్లామర్ తో అయినా సినిమాను నెట్టుకొద్దాం అని నిర్మాతల ఆశ కాబోలు.

దీంతో తిరిగి తన కెరీర్ ను దారిలోకి తీసుకురావడానికి ఆయన రామ్ గోపాల్ వర్మ ఫ్యాక్టరీతో కలవాలనుకుంటున్నట్టు తెలిసింది. ఇందుకోసం తరుణ్ రాముతో చర్చలు కూడా జరిపాడని చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి సినిమా ఫలితాన్ని చూసి ఆ తర్వాత ముంబై వెళ్లనున్నాడని సన్నిహిత వర్గాల సమాచారం. పూర్తిగా కనుమరుగయిపోయిన జెడి చక్రవర్తికి తిరిగి లైఫ్ ఇచ్చినట్టు తనకు కూడా లైఫ్ ఇస్తాడని ఆశిస్తున్న తరుణ్ కు రాము నితిన్ కెరీర్ ను 'అడవి'పాలు చేసినట్టు చెయ్యడని ఆశిద్ధాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu