For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘లవర్స్‌’ వివాదం... దర్శకుడు వివరణ

  By Srikanya
  |

  హైదరాబాద్: రీసెంట్ గా విడుదలై హిట్టైన 'లవర్స్‌' చిత్రంలో సెకండాఫ్ లో వచ్చే సప్తగిరి పాత్రని తానే డైరక్ట్ చేసానంటూ చెప్పి దర్శక,నిర్మాత మారుతి దుమారం రేపారు. ఈ విషయమై సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఓ రేంజిలో చర్చలు జరిగాయి. మారుతిని ఏకిపారేస్తూ...దర్శకుడుని సపోర్ట్ చేస్తూ చాలా మంది పోస్ట్ లు పెట్టడం జరిగింది. అయితే దర్శకుడు ఈ విషయమై ఏమంటారు అనే విషయమై అందరికీ ఆసక్తిగా ఉంది. దర్శకుడు హరినాధ్ ఈ విషయమై మీడియాతో మాట్లాడారు.

  హరినాధ్ మాట్లాడుతూ... ''నా పనిలో మారుతి ఎలాంటి జోక్యం చేసుకోలేదు. ఒక డైరెక్టర్‌కు ఎలాంటి క్రియేటివ్‌ స్పేస్‌ ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఈ సినిమా క్రియేషన్‌లో ఆయన నాకు మంచి సపోర్ట్‌నిచ్చారు'' అని చెప్పారు హరినాథ్‌.

  ఇక ...సన్నని లైన్‌ మీద ఆధారపడి తీసిన ఈ సినిమా మేం ఆశించినట్లు ప్రేక్షకులకు బాగా కనెక్టయ్యింది. అన్ని సన్నివేశాలు, పాటలు బాగా ఉన్నాయని టాక్‌ రావడానికి అదే కారణం. ఫస్టాఫ్‌ డల్‌గా, సెకండాఫ్‌లో ఎంటర్‌టైనింగ్‌గా ఉందని కొంతమంది అభిప్రాయపడిన మాట నిజం. ఎంటర్‌టైన్‌మెంట్‌ లెవల్స్‌ను క్రమేణా పెంచుకుంటూ పోవాలని స్ర్కీన్‌ప్లే తయారుచేసుకున్నాం. అందువల్లే ఫస్టాఫ్‌ కంటే సెకండాఫ్‌ను ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇదివరకు కలిసి చేయని జంటయితే బాగుంటుందనుకున్నాం. ఆ పాత్రలకు సుమంత్‌ అశ్విన్‌, నందిత బాగా సూటవుతారని తీసుకున్నాం. మా అభిప్రాయం కరెక్టని వారు నిరూపించారు. ఇంటర్మీడియేట్‌ నుంచి ఇంజనీరింగ్‌ దాకా చదివే స్టూడెంట్స్‌గా ఆ ఇద్దరూ తమ పాత్రలను రక్తికట్టించారు. సప్తగిరిని చాలా ముందుగానే ఎంచుకున్నాం. సినిమాకు అతను ఎంత ప్లస్సయ్యాడనేది నేను చెప్పాల్సిన పనిలేదు అన్నారు.

  Lovers Director about Saptagiri Scenes

  అలాగే... 'లవర్స్‌'కు వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ చాలా బాగుంది. కలెక్షన్లను, ప్రేక్షకుల స్పందనను ఆధారం చేసుకుని 2014లోని సూపర్‌హిట్‌లలో ఇదొకటని చెబుతున్నారు. చిత్రసీమకు చెందినవాళ్లు చాలామంది రెండు గంటల నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైనర్‌ తీశారని ప్రశంసిస్తున్నారు. విజువల్‌ ఫీస్ట్‌గా ఉందనీ, టిపికల్‌ బాలీవుడ్‌ రొమాంటిక్‌ కామెడీలా ఉందనీ చెబుతుంటే సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చారు.

  ఇంతకుముందు మారుతి ఏమన్నారంటే... ఈ పాయింట్ అనుకున్నప్పుడే సప్తగిరి క్యారెక్టర్ అనుకున్నాను. ఆ తర్వాత ఈ షూటింగ్ జరిగేటప్పుడు ప్రత్యేకంగా నేను వెళ్లి ఆ కామెడీ సీన్స్ ను డైరక్ట్ చేసా. సప్తగరి పిచ్చోడి పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని షూట్ చేసేటప్పుడే అనుకున్నాను అన్నారు మారుతి. ఇటీవలే విడుదలైన లవర్స్ చిత్రం హిట్ టాక్ తో దూసుకువెళ్తోంది. ఈ చిత్రంలో సప్తగిరి కామెడీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్బంగా ఆయనో సినిమా పత్రికతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

  మారుతి సమర్పణలో మాయాబజార్‌ మూవీస్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, బి. మహేంద్రబాబు సంయుక్తంగా నిర్మించిన 'లవర్స్‌'కు ఆయన దర్శకుడు. సుమంత్‌ అశ్విన్‌, నందిత జంటగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

  English summary
  Sumanth Ashwin has paired up with 'Premakatha Chitram' fame Nanditha for the movie, 'Lovers'. Maruthi has provided the screenplay and dialogues for this movie and Hari is the director.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X