»   » జైల్లోఆడియో విడుదల: నిజజీవిత సంఘటనల ఆధారంగా "లక్నో సెంట్రల్‌"

జైల్లోఆడియో విడుదల: నిజజీవిత సంఘటనల ఆధారంగా "లక్నో సెంట్రల్‌"

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మరో బాలీవుడ్ మూవీ లక్నో సెంట్రల్‌. ఫర్హాన్ అక్తర్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాకు రంజిత్ తివారీ దర్శకుడు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని విభిన్నంగా నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ పాటను ఎరవాడ జైల్లో రిలీజ్ చేశారు.

71వ భార‌త స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని ల‌క్నో సెంట్ర‌ల్‌ చిత్ర యూనిట్ ఎర‌వాడ సెంట్ర‌ల్ జైలులో జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఖైదీల కోరిక మేర‌కు ఫ‌ర్హాన్ అక్త‌ర్ వారితో క‌లిసి ఆడిపాడారు. ల‌క్నో సెంట్ర‌ల్‌ సినిమాలో గాయ‌కులుగా ఎద‌గాల‌నుకున్న న‌లుగురు ఖైదీల జీవితం గురించి చూపించామ‌ని, ఆ సినిమా పాట‌ను ఖైదీల చేతుల మీదుగా విడుద‌ల చేయించినందుకు ఆనందంగా ఉంద‌ని చిత్ర ద‌ర్శ‌కుడు రంజీత్ తివారీ అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో న‌టి డ‌యానా పెంటీ, రోనిత్ రాయ్‌, రాజేశ్ శ‌ర్మ‌, ర‌వి కిష‌న్‌, దీపక్, ఇనాములాఖ్‌ల‌తో పాటు చిత్ర‌ సంగీత ద‌ర్శ‌కులు రోచ‌క్ కొహ్లీ, అర్జున హ‌ర్జాయ్‌లు కూడా పాల్గొన్నారు.

Lucknow Central's band performed at Yerwada Jail on Independence Day

తీన్ కబూతర్ అంటూ సాగే ఈ పాటకు చిత్రయూనిట్ పాటు జైల్ లోని 300 మంది ఖైదీలు కూడా డ్యాన్స్ చేయటం విశేషం. అంతేకాదు సినిమాను కూడా జైల్లో ప్రదర్శించేందుకు అనుమతి కోరినట్టుగా నటుడు ఫర్హాన్ అక్తర్ వెల్లడించారు. ఇప్పటికే ఎరవాడ అదనపు డీజీపీ భూషణ్ కుమార్ తో ఈ విషయం పై చర్చించామని, ఆయన ఉన్నతాధికారులతో ఈ విషయాన్ని చర్చిస్తామన్నారని తెలిపారు. లక్నో సెంట్రల్ సినిమాను సెప్టెంబర్ 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
The team of 'Lucknow Central' celebrated Independence Day by performing at the Yerwada jail in Pune.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu