»   » వేలం లేదు: ‘శ్రీమంతుడు’ సైకిల్ దక్కించుకోవాలంటే ఇలా..

వేలం లేదు: ‘శ్రీమంతుడు’ సైకిల్ దక్కించుకోవాలంటే ఇలా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు' సినిమాలో వాడిన సైకిల్ వేలం వేసి తద్వారా వచ్చిన డబ్బును ఏదైనా ఏదైనా సేవా కార్యక్రమానికి వినియోగించాలనుకున్నారు. కానీ నిర్మాతలు వేలం నిర్ణయాన్ని మార్చుకున్నారు. లక్కీ డ్రా ద్వారా సైకిల్ విజేతలకు అందజేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

అందుకు మీరు చేయాల్సిందల్లా... iamsrimanthudu.com అనే వెబ్ సైట్లో రిజస్టర్ అయిన రూ. 999 విరాళం అందించడమే. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాకింగ్, పేయూ మనీ ఆప్షన్ల ద్వారా మీరు విరాళం అందించవచ్చు. మీరు డొనేట్ చేసిన తర్వాత మీ ఈమెయిల్‌కు కూపన్ వస్తుంది.


Lucky Draw for Srimanthudu Cycle

ఇలా సేకరించిన మొత్తాన్ని చారిటీ కార్యక్రమానికి వినియోగించనున్నారు. మహేష్ బాబు, శ్రీమంతుడు టీం కలిసి ఈ లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్స్ 14 సెప్టెంబర్ నుండి మొదలు కానున్నాయి. ఆన్ లైన్ ద్వారా పూర్తి పారదర్శకంగా దీన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సైకిల్ ను హైదరాబాద్ లోని ఇన్‌ఆర్బిట్ మాల్ లో ప్రదర్శనకు ఉంచారు. సెప్టెంబర్ 15 వరకు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.


లక్కీ డ్రా ఎప్పుడు అనేది త్వరలో ప్రకటించనున్నారు. విజేతలకు స్వయంగా మహేష్ బాబు చేతుల మీదుగా బ్రహ్మోత్సవం సెట్లో సైకిల్ అందజేయనున్నారు. ఇందులో పాలు పంచుకోవడం ద్వారా ఒక మంచి పని కోసం విరాళం అందించామనే సంతృప్తితో పాటు మీ లక్కు బావుంటే ఆ లక్కీ విన్నర్ మీరే కావొచ్చు.

English summary
It was reported earlier that Mahesh Babu's cycle from 'Srimanthudu' would be auctioned but the latest we hear is that this cycle would be given to the winner selected through a lucky draw. As per sources, the enthusiasts can register at iamsrimanthudu.com and each one must donate Rs 999.
Please Wait while comments are loading...