»   » సల్మాన్ ప్రేయసి కూడా తిట్టేసిందట

సల్మాన్ ప్రేయసి కూడా తిట్టేసిందట

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెప్పాలనుకున్నది సరిగా చెప్పలేకపోతే వివాదాలు తప్పవు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ తను పడిన కష్టం గురించి చెప్పబోయి అత్యాచార బాధితురాలి పరిస్థితితో తనను పోల్చుకుంటూ చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పుడప్పుడే సద్దు మణిగేలా లేదు.

సుల్తాన్ సినిమా షూటింగ్ టైం లో షాట్ పూర్తయిన తర్వాత మాత్రం అత్యాచారానికి గురైన మహిళలా తన పరిస్థితి అనిపించేందని చెప్పటం వివాదాస్పదమైంది. తన ఇంటర్వ్యూలో సల్మాన్‌ తన కష్టాన్ని అత్యాచార బాధితురాలితో పోల్చడం కొందరు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. సల్మాన్‌ వ్యాఖ్యలు చూస్తే ఒక మహిళగా ప్రపంచంమీదే తనకు నమ్మకం పోతోందని నెహ్రా అనే నెటిజన్ ఆవేదన వ్యక్తం చేసింది. సల్మాన్ వాడిన పదాలు చాలా భయంకరంగా ఉన్నాయని, ఆయన క్షమాపణ చెప్పాలని, అత్యాచార బాధితురాలి అవస్థ ఆయనకు ఎలా తెలుసంటూ పలువురు ట్వీట్లలో మండిపడ్డారు.

అయితే ఇప్పుడు ఆ విషయం అక్కడితో ఆగిపోలేదు. సల్మాన్ నిజ జీవితం లోనూ సెగలు రేపుతున్నయి. ఈ వ్యాఖ్యలపై సల్మాన్ ఖాన్ ప్రేయసి వంతుర్ లులియా కూడా స్పందించిందట. ఓ ఇంగ్లీష్ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం లులియా కూడా సల్మాన్ ఖాన్ వ్యాఖ్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిందట.

 Lulia Vantur upset with Salman Khan's

సల్మాన్ ఖాన్ అలా మాట్లాడి ఉండకూడదని కూడా అభిప్రాయపడిందట. ప్రజలకు సంబంధించిన విషయాలను మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, నోరు జారకుండా ఉండాలని కూడా సూచించిందట. సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలు పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేవిగా ఉంటాయని తెలిపిందట. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిందిగా క్లాస్ పీకిందట.

అందుకే సల్మాన్ ఇప్పుడు మీడియాతోనూ, వేదికల మీదా ఎక్కువగా మాట్లాడటం లేదు. మొన్నటికి మొన్న ఐఫా అవార్డుల వేదిక మీద కూడా "నేను ఎక్కువ సేపు మాట్లాడటం మంచిది కాదు" అంటూ త్వరగానే ప్రసంగాన్ని ముగించాడు. మొత్తానికి గాళ్ ఫ్రండ్ కూడా గడ్డి పెట్టిందన్న మాట...

English summary
According to a leading daily, Salman has got to hear some not-so-kind words from girlfriend Iulia for his comment.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu