»   » ఎం.ఎస్‌. ధోని పై సినిమా..టీజర్ ఇదిగో (వీడియో)

ఎం.ఎస్‌. ధోని పై సినిమా..టీజర్ ఇదిగో (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ హీరోగా క్రికెటర్‌ ఎం.ఎస్‌. ధోని జీవితచరిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఎం.ఎస్‌. ధోని' ది అన్‌టోల్డ్‌ స్టోరీ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసినట్లు సుషాంత్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు.

M.S.Dhoni – The Untold Story Official Teaser

కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం టీజర్‌ పోస్టర్‌ను సుషాంత్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ వ్యక్తి మీకు తెలుసు.. కానీ ఆయన ప్రయాణం మీకు తెలియదు. ఈ కథను తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఉంది అంటూ ట్వీట్‌ చేశారు.

ఈ చిత్రం షూటింగ్‌ ఖరగ్‌పూర్‌లో మొదలైంది. చిత్రం మొదటి సన్నివేశాన్ని రైల్వే కార్యాలయం వద్ద తీశారు. ధోని భారత క్రికెట్‌ జట్టులోకి రాక ముందు రైల్వే టీటీఈగా పనిచేయడమే ఇందుకు కారణం. నీరజ్‌ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ధోని పాత్రలో హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటిస్తున్నారు. చిత్రంలో అప్పటి ధోని సహచరులు నటించనున్నారు.

M.S.Dhoni The Untold Story Official Teaser

నీరజ్‌పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అరుణ్‌ పాండే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబరు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ధోని భార్య సాక్షి ధోని పాత్రలో కైరా అద్వానీ, యువరాజ్‌ సింగ్‌ పాత్రలో హెర్రీ టంగ్రీ, ధోనీ తండ్రి పాన్‌ సింగ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, భూమిక, దిశా పటానీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

భారత క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోని జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న' ధోని' చిత్రంలో ధోనికి తండ్రి పాత్రలో బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ నటిస్తున్నారు. ధోని చిత్రంలో మీ పాత్ర ఏమిటి అని అభిమానులు అడిగిన ప్రశ్నకు ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.

English summary
The cricketer. The legend. The man. The world knows M.S.Dhoni, now it’s time we know his journey. Watch the official teaser of M.S.Dhoni – The Untold Story here.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu