పండగే: ‘ఎంఎస్.ధోని’ మూవీ మన బాషలో... (తెలుగు ట్రైలర్)
హైదరాబాద్: టీమిండియా వన్డే టీమ్ కెప్టెన్ ఎమ్.ఎస్.ధోనీ జీవితంపై వస్తున్న సినిమా 'ఎమ్.ఎస్. ధోనీ-ది అన్‌టోల్డ్ స్టోరీ'. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఆ ట్రైలర్ హిందీలో ఉండటంతో దాన్ని చూసిన తెలుగు ప్రేక్షకులు పెద్దగా సంతృప్తి చెందలేదు.
అయితే ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కాబోతోంది. తాజాగా తెలుగులో ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. మరి ఆట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి
సుషాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను నీరజ్ పాండే డైరెక్ట్ చేస్తున్నాడు. హిందీ సినిమా చరిత్రలో ఇంత వరకూ ఏ సినిమా ట్రైలర్‌కు రానన్ని లైక్ లు.. వ్యూస్ 'ఎమ్.ఎస్. ధోనీ' ట్రైలర్‌కు వచ్చింది. వారం రోజుల్లో ఈ ట్రైలర్ 14 మిలియన్ల మంది వీక్షించారు.
ఈ సినిమాలో ధోనీ భార్య పాత్రలో కైరా అడ్వాణీ నటించారు. సెప్టెంబరు 30న ఈ సినిమా రిలీజ్ కావడానికి రెడీ అవుతోంది. ధోని చిన్న తనం నుండి ఆయన దేశం గర్వించదగ్గ క్రికెటర్ గా ఎదిగే వరకు అతని జీవితంలో చోటు చేసుకున్న అన్ని ముఖ్య సంఘటనలు ఈ సినిమాలో చూపించబోతున్నారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై క్రికెట్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
'ధోనీ' చిత్రంలో సుశాంత్ సింగ్ ధోనీ తొలినాళ్లలో లుక్ తలపించేలా జులపాల జుట్టుతో కనిపించబోతున్నాడు. ధోని మాధిరిగా హెలికాప్టర్ షాట్లు కొడుతూ సినిమాలో కనిపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











