For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'సాల్మన్‌రాజ్' ఆ హీరోని..: ఎమ్.ఎస్ నారాయణ

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఎమ్ ఎస్ నారాయణ ఆ మధ్యన ఫైర్ స్టార్ 'సాల్మన్‌రాజ్'పాత్రలో కనపించి నవ్వించిన విషయం గుర్తుండే ఉంటుంది. శ్రీను వైట్ల దర్సకత్వంలో వచ్చిన దుబాయి శీను లోని ఆ పాత్ర ఎవరిగురించి అన్నది ఎవరికీ అర్దం కాలేదు. చాలా మంది తమ అభిమాన హీరోలను ప్యారెడీ చేసారమో అనుకున్నారు. ఈ విషయమై ఎమ్.ఎస్ నారాయణ ఎట్టకేలకు ఏ హీరోని దృష్టిలో పెట్టుకున్నారో చెప్పారు. ఆయన మాటల్లో...ఆ సినిమాలో 'సాల్మన్‌రాజ్' పాత్ర హీరో కృష్ణగారిని దృష్టిలో పెట్టుకుని చేసింది అన్నారు.

  అంతేగాక హీరో శ్రీకాంత్ విషయం లో నేనే నోరు జారాను. అలాంటివి అప్పటివరకు మాత్రమే. కొన్ని సందర్భాల్లో ఎదుటివారి గురించి పూర్తిగా తెలియక.. వారిని లెక్కచేయకపోవడంతో అవమానపడ్డాను అన్నారు ఎమ్.ఎస్ నారాయణ. ఆయన ఆదివారం రాత్రి 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో రాధాకృష్ణతో పాల్గొని ఈ విషయంపై క్లారిపై ఇచ్చారు. అలాగే నేను అలా రెండుమూడు సార్లు గొడవ పడ్డాను. అవి ఆల్కహాల్ ప్రభావంతోనే అన్నారు.

  ఇక తన కుమారుడు విక్రమ్ తో తీసిన 'కొడుకు'చిత్రం ఫెయిల్యూర్ విషయమై మాట్లాడుతూ...మా అబ్బాయితో 'కొడుకు' అనే సినిమా తీశాను. నాకు కమర్షియల్ ట్రాక్ తెలియక నష్టపోయాను. సినిమా రంగంలో ఇప్పుడున్న వారిలో చాలా మంది కంటే నా కొడుకు అందంగానే ఉన్నాడు. నటించడం వచ్చు. అలా అని సినిమా తీశాను. కానీ, ఆడించాలంటే థియేటర్లు కావాలి. డిస్ట్రిబ్యూషన్ తెలియదు. దాంతో కోటిన్నర రూపాయల దాకా పోగొట్టుకున్నా అని చెప్పుకొచ్చారు.

  తన కళ్లకింద క్యారీ బాగులెలా విషయమై చెప్తూ...అవి 35 ఏళ్ల వయస్సులోనే వచ్చాయి. కానీ, తాగు డువల్ల వచ్చి ఉంటాయని ప్రేక్షకుల అభిప్రాయం. అయితే.. నేను తాగుతాను. కానీ.. మా ఇంటికే వెళతా ను. 'మా నాన్నకు పెళ్లి' చిత్రం నుంచి నాకు తాగుబోతు పాత్రలు వస్తున్నాయి. మొత్తంగా 500 సినిమాలు చేస్తే 200 అలాంటివే. 'తాగుబోతులా భలే నటిస్తారండి' అని అభిమానులు అంటుంటే సిగ్గనిపిస్తుంటుంది అన్నారు.

  తాను తెరపై ఎప్పుడూ తాగినటించనని అని చెప్పారు. సినిమా నాకు సరస్వతితో సమానం. మొహంమీద మేకప్ ఉండగా... ఎప్పుడూ తాగను. ఓ సారి ఒక అభిమాని మాత్రం 'మీరు తాగి నటిస్తారో లేదో గానీ, నేను మాత్రం బయటికెళ్లి తాగేస్తున్నాను' అన్నాడు. రెండుమూడేళ్ల కింద రాజమండ్రి నుంచి ఇద్దరు లిక్కర్ సిండికేట్ లీడర్లు నాదగ్గరకు వచ్చారు. నా తాగుబోతు పాత్రలు వాళ్ల వ్యాపారానికి తోడ్పడుతున్నాయంటూ సన్మానం చేస్తామన్నారు. అదేంటని ఆశ్చర్యపోయి.. పరువు పోతుంది బాబూ అంటూ వెనక్కు పంపిచేశా అని చెప్పారు.

  English summary
  Ms narayana comedy as firestar salman raj is excellent and makes to laugh again and again. He says it's about Hero Krishna manarisam.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X