»   » ‘మా’ ఎన్నికలు: వాదనలు పూర్తి, బుధవారం తీర్పు

‘మా’ ఎన్నికలు: వాదనలు పూర్తి, బుధవారం తీర్పు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలపై సిటీ సివిల్ కోర్టులో వాదనలు సోమవారం ముగిసాయి. బుధవారం నాడు ఈ కేసు విషయమై తీర్పు వెలువడనుంది. ఎన్నికలు గత నెల చివరన పూర్తయినా కోర్టు కేసు కారణంగా ఫలితాలు ఇంకా వెలువడలేదు. కోర్పు తీర్పును అనుసరించి ఫలితాల విషయం తేలనుంది.

Movie Artist Association

మా' ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని, ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ నటుడు ఒ.కళ్యాణ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయమూర్తి ‘మా' ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్, ప్రధాన కార్యదర్శి ఆలీకి నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో మురళీ మోహన్, అలీ కూడా కౌంటర్ దాఖలు చేసారు.

ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. (మా) ఎన్నికలు ఎంత రసవత్తరంగా సాగాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న రాజేంద్రప్రసాద్ వర్గం...., జయసుధ వర్గం ఒకరిపై ఒకరు విమర్శలు, మాటల తూటాలతో ఎన్నికల వాతావరణాన్ని హీటెక్కించారు. ఈ నేపథ్యంలో ‘మా' అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

English summary
Movie Artist Association election judgment reserved for April 15.
Please Wait while comments are loading...