»   » 'మా' రాజు రాజేంద్ర ప్రసాద్: జయసుధ తరఫున నరేష్

'మా' రాజు రాజేంద్ర ప్రసాద్: జయసుధ తరఫున నరేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఉత్కంఠ రేపిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం ముగిసింది. ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. జయసుధపై ఆయన ఘన విజయం సాధించారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 85 ఓట్ల తేడాతో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మా అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఓట్ల లెక్కింపునకు జయసుధ తరపున నరేష్ హాజరయ్యారు. రౌండ్ రౌండ్‌కూ రాజేంద్ర ప్రసాద్ ఆధిక్యత పెరుగుతూ వచ్చింది.

అధ్యక్ష పదవికి ప్రముఖ సినీ నటి జయసుధ, ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ పోటీ పడ్డారు. హైకోర్టు తీర్పుతో ఓట్ల లెక్కింపునకు మార్గం సులభమైంది. ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి 53 ఓట్ల ఆధిక్యంలో రాజేంద్ర ప్రసాద్ కొనసాగారు. ఏడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది.

ఫిలిం ఛేంబర్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కృష్ణ మోహన్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. రెండో రౌండ్ పూర్తయ్యే సమయానికి రాజేంద్రప్రసాద్ జయసుదపై 32 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడో రౌండ్ ముగిసే సమయానికి కూడా రాజేంద్రప్రసాద్ ఆధిక్యంలో ఉన్నారు. నాలుగో రౌండ్ ముగిసే నాటికి రాజేంద్రప్రసాద్ 46 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఇది న్యాయానికీ అన్యాయానికీ మధ్య జరిగిన పోరాటమని, న్యాయం గెలిచి తీరుతుందని శివాజీ రాజా ఓట్ల లెక్కింపునకు ముందు అన్నారు. తాను రాజేంద్ర ప్రసాద్ పక్కన ఉన్నానని, అటే ఉంటానని ఆయన అన్నారు.

MAA elections: Counting begins

గత నెల 29వ తేదీన ఓటింగ్ జరిగింది. మొత్తం 394 మంది సభ్యులు మాత్రమే ఓటింగులో పాల్గొన్నారు. మొత్తం 702 మంది సభ్యులున్నారు. సాధారణ ఎన్నికలను తలపించాయి. పలువురు సినీ ప్రముఖులు ఫిలిం ఛేంబర్‌కు చేరుకున్నారు.

English summary
Counting of votes began in MAA elections. Jayasudha and Rajendra Prasad contested for president post.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu