»   » 'మా' ఓటమి: జయసుధ బ్యాడ్ లక్, అసెంబ్లీ ఎన్నికల్లోనూ..

'మా' ఓటమి: జయసుధ బ్యాడ్ లక్, అసెంబ్లీ ఎన్నికల్లోనూ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడి ప్రముఖ సినీ నటి జయసుధ ఓటమి పాలు కావడం ఆమె దురదృష్టరమే. రాజేంద్ర ప్రసాద్‌పై 85 ఓట్ల భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. మాలో 702 మంది సభ్యులుండగా కేవలం 394 మంది మాత్రమే ఓటేశారు. అలా చూస్తే రాజేంద్ర ప్రసాద్‌ది ఘన విజయమే.

మా ఎన్నికల్లోనూ కాదు, శాసనసభ ఎన్నికల్లోనూ జయసుధను దురదృష్టం వెంటాడింది. రాజకీయాల పట్ల వైరాగ్యం ప్రదర్శిస్తూ వస్తున్న జయసుధ తన సహజ లక్షణానికి భిన్నంగా మా ఎన్నికల్లోకి దిగారు. కాంగ్రెసుకు తెలంగాణలో వ్యతిరేక పవనాలు వీస్తున్న స్థితిలో సికింద్రాబాదు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి జయసుధ ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె ఫ్యాషన్ డిజైనర్‌గా మారిపోయారు.

MAA elections: Jayasudha's bad luck

తనకు నచ్చిన కొన్ని సినిమాలు చేస్తూ ఫ్యాషన్ డిజైనర్‌గా అవతారం ఎత్తి తనకు ఇష్టమైన పని చేసుకుంటూ వస్తున్నారు. ఈ స్థితిలో మా ఎన్నికల్లోకి దిగారు.

సినీ నటుడు అన్నట్లు మా ఎన్నికల్లో ఓటమి మురళీ మోహన్‌దే గానీ జయసుధది కాదు. చాలా కాలంగా పేరుకుపోయిన అసంతృప్తి మా ఎన్నికల్లో ప్రభావం చూపినట్లు కనిపించింది. ఓట్ల లెక్కింపునకు జయసుధ హాజరు కాలేదు. ఆమె తరఫున నటుడు నరేష్ హాజరయ్యారు.

నిజానికి, జయసుధ విజయం సాధిస్తుందని అందరూ ఊహిస్తూ వచ్చారు. కానీ, ఫలితం తిరగబడింది. చాలా నిశ్శబ్దంగా మురళీ మోహన్ వ్యతిరేకత ఎన్నికల్లో ప్రతిఫలించినట్లు చెప్పవచ్చు. ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ వర్గానికి, మురళీ మోహన్ వర్గానికి మధ్య మాటల యుద్ధం సాగింది.

English summary
Defeat in MAA elections is a bad luck to Jayasudha. She also has been defeated in assembly election from Secendurabad.
Please Wait while comments are loading...