twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముగిసిన 'మా' ఎన్నిక‌: స్టార్ హీరోలు దెబ్బకొట్టారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : మొత్తానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ రోజు (ఆదివారం) ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 702 ఓట్లు కాగా 394 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఒకరిద్దరు మినహా స్టార్ హీరోలెవ్వరూ ‘మా' ఎన్నికలపై అంతగా ఆసక్తి చూపలేదు. జయసుధ, రాజేంద్ర ప్రసాద్ ప్యానెళ్ల మధ్య హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో తుది ఫలితాలను కోర్టు తీర్పు తర్వాత వెల్లడించనున్నారు.

    కోర్టు తీర్పు నేపధ్యంలో ఎన్నికలను వీడియో చిత్రీకరించారు. గత కొన్ని రోజులుగా సవాళ్లు, ప్రతి సవాళ్లతో హాట్ హాట్ గా మారిన ‘మా' ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. పోలింగ్ రోజు (ఈరోజు) ఫిలించాంబర్ కు ఓటేసేందుకు వచ్చిన జయసుధ, రాజేంద్రప్రసాద్ ఒకరినొకరు పలకరించుకున్నారు.

    MAA Elections: Jayasudha vs Rajendra Prasad

    తమ మధ్య వ్యక్తిగత వైరుధ్యాలు ఏమి లేవనీ ఇక నుంచి మళ్లీ అందరం కలిసే పని చేసుకుంటామని పేర్కొన్నారు. ఎవరు గెలిచినా సినీ కళాకారుల సంక్షేమం కోసం కలిసి పనిచేయాలని సూచించారు. కొన్ని రోజులుగా వాడివేడిగా మారిన ‘మా' వాతావరణం నేటితో చల్లబడింది.

    'మా' అసోసియేషన్ ఎన్నికలు సరదాగా, ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. బాలకృష్ణ, రోజా, మంచు విష్ణు, మంచు లక్ష్మీ ప్రసన్న,నాగబాబు, కృష్ణం రాజు ఇప్పటికే ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే యంగ్ పెద్ద హీరోలెవరూ ఇప్పటివరకూ రాలేదు. జయసుధ, రాజేంద్రప్రసాద్‌ ప్యానెళ్ల మధ్య హోరీహోరీగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్‌ జరగనుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకూ ఉన్న కోర్టు ఆదేశాల మేరకు నేడు కౌంటింగ్‌ ఉండదు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సార్వత్రిక ఎన్నికలను తలపించిన ఈ ఎన్నికలపై సినీ జనాలతోపాటు సామాన్యులు కూడా ఆసక్తి పెంచుకున్నారు. ఈ ఎన్నికలకు సంభందించిన అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు వన్ ఇండియా తెలుగు అందిస్తుంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    MAA Elections: Jayasudha vs Rajendra Prasad

    'మా' అసోసియేషన్ ఎన్నికలు సరదాగా, ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని సీనియర్ నటుడు కృష్ణంరాజు చెప్పారు. ఎవరు గెలిచిన అసోసియేషన్ ను ముందుకు నడిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీలో ఇబ్బంది పడుతున్న చిన్న చిన్న నటులకు సహాయం చేయాలన్నారు.

    MAA Elections: Jayasudha vs Rajendra Prasad

    మరో ప్రక్క మా ఎన్నికల సందర్భంగా నటుడు శివాజీరాజా.. హేమ పరస్పరం విరుద్ధంగా చేసుకున్న వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం అని మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న నటి జయసుధ అన్నారు. సాధారణ ఎన్నికలు తలపించే తీరులో ఆదివారం మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ కు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు తెలుగు చిత్ర సీమలోని నటులు మధ్య ఉన్న వైరుధ్యాలను ఒక్కసారిగా బయట పడేశాయి.

    మా ఎన్నికల సందర్భంగా నటుడు శివాజీరాజా.. హేమ పరస్పరం విరుద్ధంగా చేసుకున్న వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం అని మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న నటి జయసుధ అన్నారు. సాధారణ ఎన్నికలు తలపించే తీరులో ఆదివారం మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ కు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు తెలుగు చిత్ర సీమలోని నటులు మధ్య ఉన్న వైరుధ్యాలను ఒక్కసారిగా బయట పడేశాయి.

    MAA Elections: Jayasudha vs Rajendra Prasad

    ఈ సందర్భంగా శివాజీరాజా, హేమ వ్యాఖ్యలపై జయసుధను ప్రశ్నించగా ఆమె ఇలా స్పందించారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతారనే భయంతోనే తమ ప్రత్యర్థులు కోర్టుకు వెళ్లారని, ఎవరు ఎన్నిసార్లు మీడియా సమావేశాలు పెట్టారో ఇప్పటికే మీకు తెలుసని అన్నారు. మరిన్ని ప్రశ్నలు అడుగుతుండగా సమాధానం దాటవేసి వెళ్లారు.

    MAA Elections: Jayasudha vs Rajendra Prasad

    మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ హైదరాబాద్‌ ఫిలిం ఛాంబర్‌లో కొనసాగుతోంది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం 2గంటల వరకు జరగనుంది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌(ఈవీఎం)ల ద్వారా పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సుమారు 150 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అగ్ర హీరోలు ఎవ్వరూ ఇప్పటివరకూ ఓటు వేయలేదని సమాచారం. 350 లోపే ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

    ఇప్పటికే జయసుధ,రాజేంద్రప్రసాద్, మురళిమోహన్ తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అలాగే సుమన్ సైతం ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

    MAA Elections: Jayasudha vs Rajendra Prasad

    బయిటకు వచ్చాక...తనకు నమ్మకమున్న వ్యక్తికి ఓటు వేశానని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. ఆదివారం జరుగుతున్న మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చిన ఆయనను మీడియా పలకరించింది.

    MAA Elections: Jayasudha vs Rajendra Prasad

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మనసుకు నచ్చిన, నమ్మకమున్న వ్యక్తికి తన ఓటు ఉపయోగించానని చెప్పారు. మా పనితీరు గతంలో బాగుందా ఇప్పుడు బాగుందా.. మున్ముందు బాగుందా అనే విషయం తాను ఇప్పుడే చెప్పలేనని అన్నారు. ఇప్పుడు కొత్తగా ఎన్నికయ్యే ప్యానెల్ పనితీరు అనంతరం ఏ విషయమైన చెప్పగలమని అన్నారు. అలాగని, గతంలో పనిచేసిన ప్యానెల్ సరిగా పనిచేయలేదని చెప్పబోనని, వారు మంచే చేశారని, వచ్చే కొత్త ప్యానెల్ మరింత బెటర్ గా పనిచేస్తుందని తాను భావిస్తున్నానని అన్నారు.

    తెలుగు మూవీ ఆర్టిస్టుల సంఘంలోని 702 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 'మా' అధ్యక్ష పదవి ఎన్నికపై సినీ పరిశ్రమతో పాటు తెలుగు ప్రజల ఆసక్తి నెలకొంది. అధ్యక్ష పదవి రేసులో నటుడు రాజేంద్రప్రసాద్‌, నటి జయసుధతో పాటు బొమ్మరిల్లు ధూళిపాళ్ల అనే మరో నటుడు ఉన్నారు. మా ఎన్నికల నిర్వహణ న్యాయస్థానం పరిధిలోకి చేరినందువల్ల ఇవాళ పోలింగ్‌ మాత్రమే జరుగుతుంది. ఫలితాలు కోర్టు తుది తీర్పు తర్వాత వెల్లడయ్యే అవకాశముంది.

    MAA Elections: Jayasudha vs Rajendra Prasad

    జయసుధ, రాజేంద్రప్రసాద్‌ ప్యానెళ్ల మధ్య హోరీహోరీగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్‌ జరగనుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకూ ఉన్న కోర్టు ఆదేశాల మేరకు నేడు కౌంటింగ్‌ ఉండదు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సార్వత్రిక ఎన్నికలను తలపించిన ఈ ఎన్నికలపై సినీ జనాలతోపాటు సామాన్యులు కూడా ఆసక్తి పెంచుకున్నారు.

    English summary
    The stage set for Movie Artists Association (MAA) elections with fascinating battle on cards for various posts. After taking many turns versatile actor Rajendra Prasad & Jayasudha are in the battle for MAA president post. Watch the live updates on MAA elections...
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X