»   » అందుబాటులో ఉంటారని, జయసుధకు వ్యతిరేకం కాదు: నాగబాబు

అందుబాటులో ఉంటారని, జయసుధకు వ్యతిరేకం కాదు: నాగబాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సినీ నటుడు నాగబాబు స్పందించారు. సాక్షి తెలుగు టీవీ చానెల్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు .మా అధ్యక్ష పదవికి రాజేంద్ర ప్రసాద్‌ను ఏకగ్రీవం చేయాలని అనుకున్నామని ఆయన అన్నారు తాము జయసుధకు వ్యతిరేకం కాదని, అయితే నలుగురికి అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడయితే బాగుంటుందని భావించి మద్దతు ఇచ్చామని ఆయన అన్నారు.

మా ఎన్నికలు ప్రతిసారీ ఏకగ్రీవంగా, ఏకపక్షంగా జరిగేవని, అయితే ఈసారి మాత్రం అలా జరగకూడదని భావించారని ఆయన అన్నారు. రాజేంద్ర ప్రసాద్ గెలవాలని కోరుకున్నాను గానీ చివరకు ఎవరు గెలిచినా మంచిదేనని భావించినట్లు నాగబాబు సాక్షి టీవీ చానెల్‌తో అన ్నారు.

MAA elections: Nagababu reacts on results

మా సభ్యత్వ రుసుం తగ్గించాలని, చాలా మందికి రుసుం కారణంగా సభ్యత్వం దొరకని పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. ఈ రుసుము ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయలు ఉందని, ఎక్కువ మంది సభ్యులు చేరేలా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

పేద, వృద్ధ కళాకారులకు పింఛను అందించాలని ఆయన అన్నారు. మా ఎన్నికల సందర్భంగా తొలి దశలో జరిగిన కొన్ని పరిణామాలు తమకు మనస్తాపం కలిగించినా కోర్టు వరకూ వెళ్లాలన్న ఆలోచన రాలేదని అన్నారు. అయితే, పరిణామాలు మరో నటుడు ఓ కళ్యాణ్‌కు నచ్చకపోవడంతో కోర్టుకు వెళ్లారని అన్నారు.

English summary
Telugu film actor Naga babu reacted MAA election results. He said that he is not against Jayasudha, but wished the victory of Rajendr Prasad.
Please Wait while comments are loading...