»   » విజయం ఎవరిదో?: రేపు ఉదయం 'మా' ఎన్నికల ఓట్ల లెక్కింపు

విజయం ఎవరిదో?: రేపు ఉదయం 'మా' ఎన్నికల ఓట్ల లెక్కింపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు (శుక్రవారం) ఉదయం ప్రారంభం కానుంది. ఉదయం పది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం ఒకటి గంటల వరకు పూర్తి అయ్యే అవకాశముంది.

మార్చి 29న మా ఎన్నికలు జరిగాయి. మా అధ్యక్ష పదవికి జయసుధ, రాజేంద్రప్రసాద్‌ పోటీ పడిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల తీరుపై ఓ కల్యాణ్‌ అనే నటుడు కేసు వేయడంతో ఎన్నికలు నిర్వహించి, ఓట్ల లెక్కింపు నిలువరించమని న్యాయస్థానం గతంలో ఆదేశించింది.

rajendraprasad,jayasudha,

ఆ మేరకు ఎన్నికలు జరిగాయి. అయితే ఈ పిటిషన్‌ను బుధవారం న్యాయస్థానం కొట్టివేయడంతో ఓట్లు లెక్కించి ఎన్నికల ఫలితాలు ప్రకటించడానికి ఇప్పుడు మార్గం సుగమమైంది. మార్చి 29 న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు ఫిలిం ఛాంబర్‌లో ఈవీఎంల ద్వారా పోలింగ్ నిర్వహించారు. సంఘంలోని మొత్తం 702 ఓట్లకు గాను 394 ఓట్లు పోలయ్యాయి.

English summary
MAA elections results on friday
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu