»   » 'మా' ఎన్నికలు: జయసుధ ఓటమి, రాజేంద్ర ప్రసాద్ గెలుపు వెనక?

'మా' ఎన్నికలు: జయసుధ ఓటమి, రాజేంద్ర ప్రసాద్ గెలుపు వెనక?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో జయసుధ ఓటమి వెనక ఏం పనిచేసిందనే చర్చ జరుగుతోంది. ఆ చర్చ అంతా మురళీ మోహన్ మీదనే జరుగుతోంది. గతంలో రాజేంద్ర ప్రసాద్ మురళీ మోహన్‌పై పోటీ చేసి 7 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ, ఈసారి మురళీ మోహన్ ప్యానెల్ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేసిన జయసుధపై 85 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

తాను జయసుధకు మద్దతు ఇచ్చాననే మాటలో నిజం లేదని మురళీ మోహన్ అన్నా, జయసుధ ఆలస్యంగా రంగంలోకి దిగారనీ ప్రచారంలో చురుగ్గా పాల్గొనలేదనీ నరేష్ చెప్పినప్పటికీ ఆమె ఓటమిపై తీవ్ర ప్రభావం చూపిన అంశాలు వేరే ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. మురళీ మోహన్‌పై ఉన్న వ్యతిరేకతనే ఆమె ఓటమికి దారి తీసినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

మా అధ్యక్షుడిగా తాను పోటీ చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదనే విషయాన్ని మురళీ మోహన్ అభిప్రాయపడ్డారు. కానీ, జయసుధ ఓటమికి ఎక్కువగా పనిచేసింది మా వ్యవహారాలేనని అర్థమవుతోంది. ఆరుసార్లు మా అధ్యక్షు పదవిని మురళీ మోహన్ నిర్వహించారు. ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున లోకసభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.

 MAA elections: What contributed for Jayasudha's defeat?

జయసుధ ఓటమికి కారణాలను ఇలా చెబుతున్నారు...

మా అధ్యక్షుడిగా ఆరుసార్లు పనిచేసిన మురళీ మోహన్ జూనియర్ ఆర్టిస్టులను, క్యారెక్టర్ ఆర్టిస్టులను దూరం పెట్టారనే విమర్శ ఉంది. ఆ వర్గాన్ని రాజేంద్ర ప్రసాద్ దగ్గరకు చేర్చుకున్నట్లు చెబుతున్నారు.

మాలో మొత్తం 702 మంది సభ్యులుండగా, కేవలం 394 మంది మాత్రమే ఓటేశారు. జయసుధకు మద్దతు ఇచ్చినవాళ్లలో ఎక్కువగా పెద్దవాళ్లే ఉన్నారు. చాలా మంది వివిధ కారణాల వల్ల ఓటింగుకు రాలేదు. దీంతో జయసుధకు ఓట్లు తక్కువగా వచ్చాయని అంటున్నారు.

మురళీమోహన్ తెలుగుదేశం పార్టీ నాయకుడు కావడం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపినట్లు భావిస్తున్నారు. మా కార్యాలయాన్ని ఒక పార్టీకి సంబంధించిన కార్యాలయంగా మార్చేశారని విజయ్ చందర్ లాంటి నటులు విమర్శించారు. దానికితోడు, తెలంగాణకు చెందిన ఓ ప్రముఖ పార్టీ రాజేంద్ర ప్రసాద్‌కు అండగా నిలిచినట్లు చెబుతున్నారు.

English summary
several opinions were expressed on the defeat of Jayasudha and victory of Rajendra Prasad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu