For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  MAA లో ముసలం.. నరేష్ నన్ను లంXX కొడుకా అంటూ.. ఆవేశంగా ఉత్తేజ్ స్పీచ్

  |

  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ముసలం పుట్టింది. మంచు విష్ణు ప్యానెల్‌లోని కొందరి తీరు వల్ల, అతడికి మద్దతు ఇస్తున్న వ్యవహారతీరుపై ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై నిరసన వ్యక్తం చేసుకొంటూ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకాశ్ రాజ్‌తోపాటు హేమ, తనీష్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆవేశంగా ఉత్తేజ్ మాట్లాడుతూ..

  వాళ్లు లోకల్ కాదే..

  వాళ్లు లోకల్ కాదే..


  నా భార్య చనిపోవడం వల్ల నేను ఎలక్షన్‌లో యాక్టివ్‌గా ఉండలేకపోయాను. ఎవరికి మెసేజ్ పెట్టకపోయినా నాకు 300పైగా ఓట్లు వేసి గెలిపించినందకు ధన్యవాదాలు. ముందుగా బల్బ్ కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్‌కు, 1895లో మనకు సినిమాను ఇచ్చిన లూమియర్ బ్రదర్స్, మాయబజార్‌ను గొప్పగా అందించిన మార్కస్ బాట్లేకు సెల్యూట్. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే వీరందరూ మన తెలుగు వాళ్లు కాదు అని నటుడు ఉత్తేజ్ అన్నారు.

  ప్రకాశ్ రాజ్‌ లోకల్ కాదంటూ

  ప్రకాశ్ రాజ్‌ లోకల్ కాదంటూ

  సినిమా అనేది మన లోకల్ కాదు. తెలుగు సినిమా పవనం ఎటు వైపు వీస్తుందో ప్రకాశ్ రాజ్ ఆఫీస్‌ను చూస్తే తెలుస్తుంది. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. తెలుగు సినిమాను తనదిగా చేసుకొని ఏదో చెద్దామని వచ్చారు. అలాంటి వ్యక్తి వెంట నడవడానికి నిర్ణయం తీసుకొన్నాం. అలాంటి వ్యక్తిని లోకల్ కాదు అంటారా? ఉత్తేజ్ ఆవేదన వ్యక్తంచేశారు.

  కొడుకుల్లారా నీ సంగతి చెబుతా అంటూ

  కొడుకుల్లారా నీ సంగతి చెబుతా అంటూ

  మా తరఫున నాటకాలు ఆడేందుకు చాలా చోట్లకు వెళ్లాం. లక్ష రూపాయలు వచ్చినా మా భవనానికి ఉపయోగపడుతుందని చాలా చోట్ల నాటకాలు వేశాం. ఒక చోట నాటకం ప్రదర్శించడానికి వెళితే నరేష్ ఇద్దరు బౌనర్లను పెట్టుకొని దోమల మందు రాసుకొంటున్నారు. సాధారణంగా నాటకం జరిగితే స్టేజ్ ముందు అటు ఇటు ఎవరూ వెళ్లకూడదు. అలాంటిది ఆయన మందు రాసుకొంటూ కనిపించారు. దాంతో అన్న నరేష్ ఇలా చేయకూడదంటే నావైపు ఓ రకంగా చూశారు. ఇక ఎన్నికల రోజున ముఖంలో ముఖం పెట్టి లం... కొడుకుల పనిచెబుతా అంటూ తిట్టాడు. నా తల్లిని తిట్టడానికి అతను ఎవరు అని ఉత్తేజ్ అన్నారు.

  చిరంజీవి పాల్గొన్న ప్రోగ్రాం నిధుల్లో గోల్‌మాల్

  చిరంజీవి పాల్గొన్న ప్రోగ్రాం నిధుల్లో గోల్‌మాల్

  ఇక కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకొన్న మెగాస్టార్ చిరంజీవి మా సంస్థకు విరాళాలు సేకరించడానికి అమెరికాకు వచ్చారు. అలాంటి వ్యక్తి వచ్చిన కార్యక్రమానికి సంబంధించిన నిధుల్లో గోల్‌మాల్ జరిగిందని చెబుతావా. దాంతో చాలా మంది హీరోలు అలాంటి కార్యక్రమాలకు రాలేదు. ఇలాంటి అక్రమాలు ఎన్నో జరిగాయి. ఎన్నికలు జరుగుతుంటే.. బారికేడ్లు పెట్టారు. ఎన్నికల సమయంలో బీభత్సమైన వాతావరణం నెలకొన్నది. బెనర్జీ ఎన్నడూ కంటతడి పెట్టుకోని ఆయన ఈ రోజు మోహన్ బాబు తీరుతో కంటతడి పెట్టుకొన్నారు. నన్ను ఒకడు వచ్చి నెట్టేశాడు అని ఉత్తేజ్ అన్నారు.

  Bigg Boss Telugu 5: Hamida కోసం విశ్వ ఎలిమినేట్ ? ఆమెకు తక్కువ ఓట్లు.. కానీ ! || Oneindia Telugu
  ఫలితాలు వెల్లడించకుండా తారుమారు..

  ఫలితాలు వెల్లడించకుండా తారుమారు..

  ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాలను వెల్లడించకుండా గోప్యంగా ఉంచారు. నరేష్ అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లోనే అనేక బేదాభిప్రాయలు కనిపించి మా సంస్థ పురుగోతి కుంటుపడింది. ఇప్పుడు పోలింగ్ రోజే పరిస్థితి ఉంటే.. కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. కాబట్టి నీవు మంచి చేస్తావనే నమ్మకం. తెలుగు సినిమా వైభవం నీ వెనుక ఉంది. తిరుపతిలో పెద్ద యూనివర్సిటీ నడుపుతున్నావు. మా సంస్థను కూడా బాగా నడుపుతావు. కాబట్టి మా సభ్యుల మంచిచెడులను చూసుకొంటావనే నమ్మకం ఉంది. కాబట్టి మీరు ముందుకు వెళ్లవచ్చు. మేము లేకున్నా మీరు నడిపిస్తారనే నమ్మకంతో రాజీనామా చేస్తున్నాను అని ఉత్తేజ్ అన్నారు.

  English summary
  MAA Elections 2021's Voting is going with high tension mode. MAA Into Deep Crisis: Prakash Raj Panel members resigned. Actor Uttej show real face of VK Naresh
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X