twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ఇద్దరే విలన్లు.. వారితోనే మా ప్రతిష్ట దిగజారింది.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌ సభ్యుల ధ్వజం

    |

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ (మా) ఎన్నికల తర్వాత అవినీతి, అక్రమాలకు సంబంధించిన భాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఫలితాలు వెల్లడైన తర్వాత కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకొంటూ సినిమా పరిశ్రమ ప్రతిష్టను రోడ్డును పడేస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందు కొందరు వ్యక్తులు అత్యంత వివాదాస్పదంగా మారారు. అయితే తాజాగా విష్ణు మంచు ప్యానెల్‌ను వెనుక ఉండి నడిపించిన ఆ ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు కొందరి దృష్టిలో విలన్లుగా మారారు. ఆ ఇద్దరు ఎవరంటే..

    వీకే నరేష్ వివాదాలకు కేంద్ర బిందువుగా

    వీకే నరేష్ వివాదాలకు కేంద్ర బిందువుగా

    మా ఎన్నికలు జరగడానికి ముందు ప్రచారంలో అత్యంత వివాదాలకు వీకే నరేష్ కేంద్ర బిందువుగా మారాడనే విమర్శలు వచ్చాయి. ఆయనపై కొందరు అవినీతి ఆరోపణలు చేయడంతో మీడియాలో ఆయన సంచలన ప్రకటనలు చేశారు. విష్ణు విజయానికి నా బాధ్యత అంటూ ప్రత్యర్థులకు సవాల్ విసిరిరారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి.

    నాగబాబు, ప్రకాశ్ రాజ్ రాజీనామాలతో

    నాగబాబు, ప్రకాశ్ రాజ్ రాజీనామాలతో

    ఆదివారం వెల్లడైన ఎన్నికల ఫలితాల తర్వాతే అసలు నాటకానికి తెర లేచింది. నాగబాబు రాజీనామా చేయడంతో రాజీనామా పర్వం మొదలైంది. సోమవారం ఉదయమే ప్రకాశ్ రాజ్ రాజీనామా చేసి సంచలన విషయాలను వెల్లడించారు. తెలుగు వ్యక్తి మా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.

    అనసూయ ఫలితం తారుమారు..

    అనసూయ ఫలితం తారుమారు..

    ఇక ఆదివారం రాత్రి కొన్ని పోస్టుల ఫలితాలు వెల్లడించి.. మరికొన్నింటిని ఆపడం వివాదాస్పదమైంది. అయితే ఆదివారం రాత్రి అనసూయ, తదితరులు గెలిచినట్టు ప్రకటించారు. కానీ సోమవారం ఫలితాలను తారుమారు చేసి.. ఓడినట్టు ప్రకటించడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. విష్ణు ప్యానెల్‌లో సభ్యులను ప్రకటించి.. ఆధిక్యతను ప్రదర్శించాలని నిర్ణయం తీసుకొన్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు మూకుమ్మడి రాజీనామా చేశారు.

    ఆ ఇద్దరి వల్లే ఇండస్ట్రీ ప్రతిష్టకు మసక

    ఆ ఇద్దరి వల్లే ఇండస్ట్రీ ప్రతిష్టకు మసక

    ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లోని సభ్యులు తమ రాజీనామాను ప్రకటిస్తూ నిర్వహించిన మీడియా సమావేశంలో మంచు మోహన్ బాబు, మంచు విష్ణుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు మంచివాడే కానీ.. ఆయన వెనుక ఉన్న తండ్రి మోహన్ బాబు, సన్నిహితుడు, మాజీ అధ్యక్షుడు వల్లే ఇండస్ట్రీ ప్రతిష్ట మసకబారుతున్నది. మా సంస్థ పరువు బజారున పడుతున్నదని ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌లోని ప్రతీ ఒక్కరు సంచలన ఆరోపణలు చేశారు. మోహన్ బాబు రౌడీయిజం చేశారు. నోటికి వచ్చినట్టు తిట్టారు.

    Recommended Video

    Bigg Boss Telugu 5: Hamida కోసం విశ్వ ఎలిమినేట్ ? ఆమెకు తక్కువ ఓట్లు.. కానీ ! || Oneindia Telugu
    ఆ ఇద్దరే విలన్లు అంటూ ..

    ఆ ఇద్దరే విలన్లు అంటూ ..

    ప్రకాశ్ రాజ్‌ ప్యానెల్‌లోని ఉత్తేజ్, ఈటీవీ ప్రభాకర్, బెనర్జీ, తనీష్, ఇంకా చాలా మంది మోహన్ బాబును టార్గెట్ చేయడం విష్ణును డిఫెన్స్‌లో పడేసే విధంగా మారింది. అయితే తన ప్రత్యర్థులు పన్నిన వ్యూహం నుంచి విష్ణు మంచు ఎలా గట్టెక్కుతాడో వేచి చూడాల్సిందే. అయితే మోహన్ బాబు, వీకే నరేష్ విలన్లుగా చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నం వాస్తవమా? లేదా అనేది కాలమే సమాధానం చెబుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

    English summary
    MAA Elections 2021's Voting is going with high tension mode. MAA Into Deep Crisis: Prakash Raj Panel members resigned. Prakash Raj panel alleges Mohan Babu, VK Naresh
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X