twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మానసిక క్షోభ అనుభవించా, శివాజీ రాజాను క్షమిస్తా, శతృత్వం లేదు: ‘మా’ కొత్త అధ్యక్షుడు నరేష్

    |

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం నటుడు నరేష్ ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యరు. ఆదివారం రాత్రి ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ... ఎన్నికల సందర్భంగా కొందరు చేసిన ఆరోపణలతో మానసిక క్షోభకు గురైనట్లు తెలిపారు.

    నాపై చేసిన ఆరోపణలను తాను మనసులో పెట్టుకోవడం లేదని, మిత్రుడు శివాజీ రాజాను క్షమిస్తాను, ఆయనపై నాకు ఎలాంటి శతృత్వం లేదని, పదవి లేక పోయినా 'మా'తో కలిసి పని చేయాలని ఆహ్వానిస్తున్నాను, అందరం కలిసి 'మా' అభివృద్ధికి పాటు పడాలన్నదే తన ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.

    ముందుగా ఆ ఇద్దరికీ థాంక్స్

    ముందుగా ఆ ఇద్దరికీ థాంక్స్

    తల్లిదండ్రులను ఆదరిద్దాం.. అమ్మ ‘మా'ను రక్షించుకుందామనే నినాదంతో ముందుకు వెళ్లాం. ఈ విజయం నేపథ్యంలో ముందుగా నేను థాంక్స్ చెప్పాల్సింది మా అమ్మ విజయ నిర్మలగారికి, కృష్ణగారికి. ఎప్పుడూ ఏదీ ఆశించకుండా, ‘మా' అడగకుండానే ప్రతి సంవత్సరం మా కుటుంబం నుంచి మేము పంపిస్తాం. అవన్నీ నేను ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదు. వారిద్దరికీ ధన్యవాదములు.

    మెగాస్టార్ చిరంజీవితో పాటు అందరూ సపోర్ట్ ఇచ్చారు

    మెగాస్టార్ చిరంజీవితో పాటు అందరూ సపోర్ట్ ఇచ్చారు

    మెగాస్టార్ చిరంజీవిగారితో పాటు అందరూ మాకు సపోర్ట్ ఇచ్చారు. నాగబాబు డైరెక్టుగా మా వద్దకు వచ్చి మీ ప్యానల్ బావుంది మీరు గెలుస్తున్నారు అని చెప్పారు. నాగార్జునతో పాటు ఇలా అందరి మద్దతు ఉందని, మా ముగ్గురిపై నమ్మకం ఉంచి గెలిపించిన అందరికీ ధన్యవాదములు.

    మానసిక క్షోభకు గురయ్యాను

    మానసిక క్షోభకు గురయ్యాను

    భగవంతుడు నాకు ఈ రోజు అన్నీ ఇచ్చాడు. డబ్బు ఇచ్చాడు, సక్సెస్ ఇచ్చాడు. ‘మా' అమ్మకు సేవ చేద్దామని వచ్చాను. గతంలో జాయింట్ సెక్టరీగా, జనరల్ సెక్రటరీగా గెలిచాను. గత టర్మ్‌లో ప్రెసిడెంటుగా నన్ను ఉండమంటే.. మిత్రుడు శివాజీరాజాకు చేయాలని కోరిక ఉందని చెప్పి ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేలా చేశాను. మనస్తాపాలు వస్తూ ఉంటాయి. కానీ నన్ను మానసిక క్షోభకు గురయ్యా..అది ఎవరి వల్ల అనేది నేను చెప్పను.

    ఆర్య, సాయేషా పెళ్లి సందడి.. సంగీత్‌లో అల్లు అర్జున్ కేక.. బుగ్గపై ముద్దుపెట్టి..!ఆర్య, సాయేషా పెళ్లి సందడి.. సంగీత్‌లో అల్లు అర్జున్ కేక.. బుగ్గపై ముద్దుపెట్టి..!

    భయంకరంగా దూషించారు

    భయంకరంగా దూషించారు

    ప్రచారంలో మేము ఎవరినీ దూషిస్తూ ఒక మాట అనలేదు. అమ్మ ఇచ్చింది నువ్వేం ఇచ్చావు అని కొంతమంది.. హ్యాండ్ సానిటైనర్లు వాడుతున్నారు వీళ్ల చేతి కూడు తినాలా? అని కొంత మంది ఇలాంటి భయంకరమైన సందేశాలు ఎప్పుడూ చూడలేదు. ఇదేనా మా అమ్మ ‘మా' అనిపించింది. గుండె మీద చేయి వేసుకుని వెళ్లిపోయాను. తల్లిదండ్రులను గౌరవిస్తాం, ‘మా' కోసం ఊడిగం చేస్తాం అని చెప్పాను. ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డాం. ఇదంతా ‘మా' మధ్య ఉండాల్సిన విషయాలే.. కానీ బయటకు వచ్చాయి కాబట్టి చెబుతున్నాను.

    మిత్రమా శివాజీ రాజా... వి విల్ ఫర్ గివ్ యూ

    మిత్రమా శివాజీ రాజా... వి విల్ ఫర్ గివ్ యూ

    మిత్రమా శివాజీ రాజా... నాకు 50 ఓట్లు రావు, జీవితంలో ప్రెసిడెంటువు కావు అన్నావు. ఇలాంటివి అన్నీ ఓపెన్‌గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజున 70 ఓట్ల మెజారీటీతో గెలిచాను. మిత్రమా శివాజీ రాజా.. ఎప్పుడూ నీతోనే ఉన్నాను. విలవ్ యూ.. వి విల్ ఫర్ గివ్.. కలిసి పని చేద్దాం. రండి.. ఎటువంటి వేరే ఆలోచనలు మా దగ్గరికి వచ్చిన వారందరినీ ఆదరిస్తాం. ప్రతి ఒక్క సభ్యుడికి మేనిఫెస్టోలో ఉన్న విధంగా చేస్తాం.

    నీ మీద శతృత్వం లేదు

    నీ మీద శతృత్వం లేదు

    ఇది ఎవరినీ దూషించడానికి అనడం లేదు. నా మనసుతో చెబుతున్నాను. ‘మా' సిల్వర్ జూబ్లీ ఇయర్లో మచ్చలు ఏమైనా ఉంటే తుడిపేసి ముందుకు వెళదాం అన్నాను. ఈ రోజు అదే మాటపై ఉన్నాం. అందరి ఆదరణ ఉంది. శివాజీ ఐ లవ్ యూ.. నీ మీద ఎటువంటి శతృత్వం మాకు లేదు. మనం 30 ఏళ్లు కలిసి పని చేశాం.

    ఈ ఒక్క టర్మే అధ్యక్షుడిగా ఉంటాను

    ఈ ఒక్క టర్మే అధ్యక్షుడిగా ఉంటాను

    మా చెల్లమ్మ జీవిత, బావగారు రాజశేఖర్‌తో కలిసి అసోసియేషన్‌కు మంచి టర్మ్ ఇవ్వడంతో పాటు మంచి లీడర్ షిప్ అందిస్తాం. మీ అందరి ముందు మా అమ్మ సాక్షిగా... ఈ ఒక్క టర్మే అధ్యక్షుడిగా చేస్తాను. మళ్లీ కోరను. కానీ మంచి లీడర్ షిప్ ఇచ్చి వెళతాను. బాగా పని చేస్తాం. ఈ రోజు నువ్వు ఏం చేశావ్ అని అడిగినందుకే ప్రజలు అందించిన విజయం ఇది. నేను ఏం చేశానో ప్రజలకు తెలుసు. మెంబర్లకు తెలుసు... అని నరేష్ వ్యాఖ్యానించారు.

    English summary
    MAA elections 2019 results released. Naresh elected as MAA President. The reason is that the Naresh team is supported by popular actors like Chiranjeevi, Nagarjuna and Mahesh Babu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X